Site icon A2Z ADDA

Rashmi Gautham: ముద్దులు పెట్టినా ఏమీ అనడం లేదు!.. వామ్మో యాంకర్ రష్మీ రచ్చ

Rashmi Gautham యాంకర్ రష్మీ గౌతమ్ అప్పుడప్పుడు కొన్ని కొంటె చేష్టలు చేస్తుంది. మాములుగా అయితే సోషల్ మీడియా మూగ జీవాలకు సంబంధించిన విషయాలనే షేర్ చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు దీపిక పిల్లితో కలిసినప్పుడు వీకెండ్ పార్టీలు, పబ్బులు అంటూ తిరుగుతుంది. అల్లరల్లరి చేస్తుంది. తాజాగా సోషల్ మీడియా రష్మీ ముద్దుల వర్షాన్ని కురిపించింది.

సోషల్ మీడియాలో ఈ మధ్య వింత వింత యాప్స్ వస్తున్నాయి. మొహాలను వెరైటీ మార్చేసుకుని మాట్లాడుతుంటారు. యానిమేషన్ బొమ్మలు వస్తుంటాయి. అలా తాజాగా రష్మీ ఓ రీల్ వీడియోను చేసింది. అందులో ఓ బొమ్మ రష్మీని హత్తుకుని ముద్దులు పెట్టేసింది. రష్మీ కూడా ముద్దుల వర్షం కురిపించేసింది. అందులో రష్మీ ఎంతో క్యూట్‌గా ఉంది.

రష్మీ నవ్వులకు జనాలు ఫిదా అవుతుంటారన్న సంగతి తెలిసిందే. ఇక ఈ వీడియోలో రష్మీ నవ్వులు చిందించింది. ప్రస్తుతం ఈ క్యూట్ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. రష్మీ బుల్లితెరపైనే కాకుండా వెండితెరపైనా హల్చల్ చేస్తోంది. బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ నందుతో కలిసి రష్మీ రచ్చ చేయబోతోంది. ఇక చిరంజీవి భోళా శంకర్ సినిమాలోనూ రష్మీ ఓ పాత్రలో కనిపించబోతోంది.

Exit mobile version