Site icon A2Z ADDA

టాలీవుడ్‌లోకి వెల్కం.. ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల సంచలన నిర్ణయం

Tollywood Producers And Film Chamber Welcomes everyone without any union barriers

టాలీవుడ్ ఓ గొప్ప అడుగు ముందుకు వేసింది. ఇంత వరకు తెలుగు చిత్ర సీమలోకి అడుగు పెట్టాలంటే ఎన్నో యూనియన్స్ అడ్డంగా ఉంటూ వచ్చేవి. ప్రొడక్షన్ బాయ్‌గా చేయాలన్నా, ఏ డిపార్ట్మెంట్‌లో పని చేయాలన్నా కూడా యూనియన్ కార్డు ఉండాలి.. యూనియన్ కార్డ్ ఉన్న వారినే పనిలోకి తీసుకోవాలనే రూల్‌ను పాటిస్తూ వచ్చారు. ఆ యూనియన్ కార్డులు తీసుకోవాలంటే లక్షల్లో ఖర్చు పెట్టాల్సి వచ్చేది. అలా లక్షలు ఎందుకు పెట్టాలి? ఆ కార్డ్ ఎందుకు తీసుకోవాలి? వారినే మేం ఎందుకు పనిలో పెట్టుకోవాలి? అని ఇప్పుడు టాలీవుడ్ నిర్మాతలు నిర్ణయం తీసుకుని యూనియన్లకు షాక్ ఇచ్చారు.

తెలుగు చిత్ర సీమలో ఇప్పటికే కార్మికులు పెద్ద ఎత్తున వేతనాలు ఇస్తున్నారు. కానీ ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు, యూనియన్లు మాత్రం ఇంకా వేతనాలు పెంచాలని డిమాండ్ చేయడం, షూటింగ్‌లు బంద్ చేయడంతో నిర్మాతలంతా కలిసి కట్టుగా ఇలాంటి ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఇకపై సినిమాలకు పని చేయాలంటే యూనియన్లు అవసరం లేదని, అక్కడ లక్షలు పెట్టి కార్డులు తీసుకోవాల్సిన పని లేదని తెలిపారు.

ఎవరికైతే ఎందులో నైపుణ్యం ఉంటుందో.. ఆ డిపార్ట్మెంట్‌లో స్వేచ్చగా పని చేసుకోవచ్చని, ఇండస్ట్రీలోకి రావాలని అనుకున్న వారందరినీ స్వాగతిస్తున్నాం అంటూ టాలీవుడ్ నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించింది. ఈ మేరకు కొత్తగా ఇండస్ట్రీలోకి రావాలని అనుకునే వారు
Apply Now:
https://atfpg.com/form.html
: info@atfpg.com
వీటి ద్వారా అప్లై చేసుకోవచ్చు.

Exit mobile version