Site icon A2Z ADDA

Thank You విషయంలో ఇంత జరిగిందా?.. అందుకే తేడా కొట్టేసిందా?

వంట ఒకరు వండితే బాగానే ఉంటుంది.. అందరూ తలా ఒక చేయి వేస్తే వంట పాడవుతుంది.. చివరకు వంట కాస్త పెంటలా మారుతుంది. సినిమా కూడా అంతే. కథ ఒకరు ఇచ్చి.. దర్శకత్వం ఇంకొకొరు చేసి.. నిర్మాత ఇంకేవో సలహాలు ఇచ్చి.. ఎడిటింగ్ టేబుల్ వద్ద ఇంకొంత లేపేస్తే చివరకు Thanku You సినిమాలా డిజాస్టర్ అవుతుంది. ఇప్పుడు Thanku You విషయంలో ఓ కొత్త మ్యాటర్ బయటకు వచ్చింది. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గానీ.. విషయం మాత్రం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది.

బీవీఎస్ రవి.. యూనివర్సల్ అప్పీల్‌ ఉండేలా కథను రాసుకుంటే.. దాన్ని దర్శకుడు తనకు నచ్చిన విధంగా మార్చుకున్నాడట. ఇక చివరకు దర్శకుడి మీద నమ్మకంతో నిర్మాత, కథా రచయిత సైలెంట్‌గా ఉన్నారట. ఇక పాటల విషయంలోనూ దర్శకుడికి, నిర్మాతకు మధ్య సయోద్య రాలేదట. తమన్ కూడా తల కొట్టేసుకున్నాడట. చివరకు విక్రమ్ కే కుమార్ దీన్ని తన యూనిట్‌లోని సభ్యులకు అప్పజెప్పేసి వెళ్లిపోయాడట.

ఇక ఎడిటింగ్ టేబుల్ వద్ద దిల్ రాజు దాదాపు 30 నిమిషాల కథను లేపేశాడట. అదంతా కూడా ఫారిన్‌లో షూట్ చేశారట. దాని విలువ దాదాపు ఆరు కోట్లు ఉంటుందట. అలా మొత్తానికి Thanku You విషయంలో ఎన్నెన్నో పొరపాట్లు జరిగాయి. తప్పు ఎవరు చేసినా కూడా చివరకు సినిమా మాత్రం నిండా మునిగిపోయింది. దిల్ రాజుకు, చైతన్య, విక్రమ్ కే కుమార్‌కు మచ్చలా మిగిలింది. చివరకు రచయిత మచ్చ రవికి కూడా మాయని మచ్చలానే మిగిలింది.

Exit mobile version