Thaman-Nandamuri Balakrishna ప్రీ రిలీజ్ ఈవెంట్లు అంటే భజన కార్యక్రమాల్లా తయారయ్యాయి. అయితే ఎక్కడ ఉంటే.. ఏ ఈవెంట్‌కు వెళ్తే అక్కడే భజన చేయాల్సి ఉంటుంది. అది తప్పదు. అంటే ఏ ఎండకు ఆ గొడుగు అంటారు కదా? అలాందే అన్నమాట. అయితే నిన్న జరిగిన అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తమన్ మాటలన్నీ కూడా చాలా ఎక్కువైపోయాయి. మోతాదుకు మించి అనేలా పొగిడేశాడు తమన్.
బాలయ్యను ఏకంగా ఇండస్ట్రీకి శివుడిని చేసేశాడు. అదో ట్రాన్స్‌లోకి వెళ్లిపోయాను అన్నాడు. సినిమా గురించి చెప్పడం ఒకెత్తు అయితే.. నందమూరి వంశం గురించి చెప్పడం మరో ఎత్తు. సీనియర్ ఎన్టీఆర్, జూ. ఎన్టీఆర్, బాలకృష్ణ ఇలా అందరి గురించి మాట్లాడేశాడు. అసలే ఈవెంట్ చాలా ఆలస్యంగా ప్రారంభమైందంటే.. అందులో తమన్ వాయింపు మామూలుగా లేదు.
స్పీచును అలా ప్రవాహాంలా పొర్లించాడు. ఎక్కడ మొదలు పెట్టాడు ఎక్కడ ఆపాడో కూడా తెలియనంతగా ప్రసంగించాడు. భైరవ ద్వీపం సినిమాకు మొదటగా పని చేశాడట. అప్పుడే తన కెరీర్ మొదలైందట. బాలయ్య సినిమాతోనే తన కెరీర్ ప్రారంభమైందట. పన్నెండేళ్ల వయసులో పని చేశాడట. అప్పుడు ముప్పై రూపాయలు ఇచ్చారట.
ఈ విషయాన్ని అఖండ స్టేజ్ మీదే గుర్తుకు వచ్చాయి మన తమన్‌కు. సినిమా ఎలా ఉంటుందో.. దాని ఫలితం ఏంటో గానీ ప్రీ రిలీజ్ ఈవెంట్లలో ఇలాంటి అతిశయోక్తి మాటలు మాత్రం మామూలుగా ఉండవు. మొత్తానికి తమన్ భజన మాత్రం నెట్టింట్లో వైరల్ అవుతోంది. అఖండ డిసెంబర్ 2న విడుదలకాబోతోంది.
