Site icon A2Z ADDA

అదిరా తమన్ అంటే.. దెబ్బకు పగిలిపోతే కొత్తది ఇచ్చేశాడు!

తమన్ కొట్టే కొట్టుడుకు థియేటర్లో బాక్సులే బద్దలు అవుతుంటాయి. ఇక ఇంట్లో పెట్టుకునే హోం థియేటర్లు, సౌండ్ బార్స్ ఆగుతాయా?.. తాజాగా ఫైర్ స్ట్రామ్ అంటూ తమన్ కొట్టిన కొట్టుడుకు చాలా మంది ఇంట్లో సౌండ్ బాక్సులు పగిలిపోతోన్నాయి. తాజాగా పవన్ అభిమాని ఇలానే ఓజీ నుంచి వచ్చిన ఈ ఫస్ట్ సింగిల్‌ను తన ఇంట్లో పెద్ద సౌండ్ పెట్టుకుని వింటూ ఎంజాయ్ చేస్తున్నాడట. తమన్ భయ్య కొట్టిన కొట్టుడుకు ఆ సౌండ్ బాక్స్, సౌండ్ బార్ దెబ్బకు పాడైపోయాయ్ అంట. దీంతో ఆ పిల్లాడు కంగారు పడిపోయాడట.

నాన్న వస్తే ఏం చెప్పాలి.. తిడతాడేమో అని తమన్‌కు తన రిక్వెస్టు పెట్టుకున్నాడు. దీంతో వెంటనే తమన్ రంగంలోకి దించాడు. తన టీంకు చెప్పి.. అతగాడికి కొత్త సౌండ్ బార్‌ను కొనిచ్చేశాడు. నీకు కొత్తది పంపిస్తున్నా.. అస్సలు తగ్గకు.. ఎంజాయ్ చేసుకో అని తమన్ అన్న రిప్లై ఇచ్చాడు. ఇక తమన్ అలా ట్వీట్ వేయడం ఆలస్యం.. తమన్ టీం వెంటనే రియాక్ట్ అయి.. కొత్తది కొనిచ్చాం.. పంపించాం అంటూ ట్వీట్ వేసేసింది. మొత్తానికి తమన్ వల్ల ప్రతీ ఇంట్లో బాక్సులు బద్దలు అయ్యేలా ఉన్నాయి.

 

Exit mobile version