Site icon A2Z ADDA

ఆకట్టుకుంటోన్న ‘తీస్ మార్ ఖాన్’ థీమ్ సాంగ్

స్టూడెంట్, రౌడీ, పోలీస్ గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆది సాయికుమార్ హీరో గా నటిస్తున్న తాజా చిత్రం “తీస్ మార్ ఖాన్”. విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 3 గా ప్రముఖ వ్యాపారవేత్త డా.నాగం తిరుపతి రెడ్డి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తుంది.నాటకం వంటి విభిన్న కథాంశంతో కూడుకున్న చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకులను అలరించిన దర్శకుడు కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది.

ఇప్పటికే విడుదల చేసిన టీజర్, పోస్టర్స్, ట్రైలర్స్ ఇలా అన్నీ కూడా సినిమా పట్ల ఆసక్తి పెంచాయి. ఈ చిత్రం ఆగస్ట్ 19న విడుదల కానున్న సందర్భంగా ప్రమోషన్స్ మరింత పెంచేశారు. ఈ క్రమంలోనే ఈ చిత్రం నుంచి మరో సాంగ్‌ను విడుదల చేశారు. తీస్ మార్ ఖాన్ థీమ్ సాంగ్‌ను మేకర్లు తాజాగా విడుదల చేశారు. ఇందులో ఆది సాయికుమార్ మ్యానరిజం, యాటిట్యూడ్, యాక్షన్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి.

ఇక ఆది సాయి కుమార్ పాత్ర ఎలా ఉంటుందనేది థీమ్ సాంగ్‌తో క్లియర్‌గా చూపించారు. సాయి కుమార్ ఫేమస్ డైలాగ్‌ను తన స్టైల్లో ఆది చెప్పడం బాగుంది. ఇందులో ఆది ఎంతో కొత్తగా కనిపిస్తున్నారు. ఇక పాటకు సాయి కార్తీక్ అందించిన ట్యూన్, కొట్టిన సంగీతం ఆది పాత్రను మరో లెవెల్‌లో చూపించింది.

ఈ చిత్రానికి సంగీతం సాయి కార్తీక్ అందించగా.. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ చేశారు. మణికాంత్ ఎడిటర్ గా వర్క్ చేసి స్మార్ట్ అవుట్ పుట్ తీసుకొచ్చారు.

సాంకేతిక నిపుణులు

బ్యానర్ : విజన్ సినిమాస్
డైరెక్టర్ : కళ్యాణ్ జి గోగణ
ప్రొడ్యూసర్ : నాగం తిరుపతి రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : యాళ్ల తిర్మల్ రెడ్డి
మ్యూజిక్ : సాయి కార్తీక్
ఎడిటర్ : మణికాంత్
సినిమాటోగ్రాఫర్: బాల్ రెడ్డి
పీఆర్వో : సాయి సతీష్ , పర్వతనేని రాంబాబు

Exit mobile version