బిగ్ బాస్ ఇంట్లో సన్నీ, ప్రియలది ప్రత్యేక ట్రాక్. ఈ ఇద్దరి మధ్యలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వ్యవహారం ఉంటుంది. మొదటివారం నుంచీ ఈ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఒకరినొకరు నామినేట్ చేసుకుంటూనే వస్తున్నారు. ఎంత ట్రై చేసినా కనెక్షన్ సెట్ అవ్వడం లేదు.. సన్నీ మాట్లాడటం లేదు అనే కారణంతో ప్రియ నామినేట్ చేస్తూ వస్తుంది. అలానే సన్నీ కూడా ప్రియను నామినేట్ చేస్తూ వస్తున్నాడు.
అయితే వీరిద్దరి మధ్య గొడవలు ఈ వారంలో తారాస్థాయికి చేరుకున్నాయి. చెంపపగలగొడతాను అంటూ ప్రియ వార్నింగ్ ఇవ్వడం.. దమ్ముంటే టచ్ చేసి చూడు అని సన్నీ మీద మీదకు రావడంతో ఇద్దరి మధ్య దూరం పెరుగుతుందని అనుకున్నారు. కానీ ఈ ఇద్దరూ చాలా క్లోజ్అయ్యారు. కావాలనే ప్రియ కవ్వించినట్టు కనిపిస్తుంది. సన్నీ ప్లేట్లో అన్నం తినడం, సన్నీతో సరసాలు ఆడటం వంటివి చేసింది.
నిన్నటి ఎపిసోడ్‌లో ప్రియ మరీ బరితెగించినట్టు కనిపించింది. సన్నీకి కన్ను కొట్టి ముద్దు పెడతాను అని అందరి ముందే చెప్పేసింది. ఇక సన్నీ అయితే ఆనీ మాస్టర్‌కు ఇంగ్లీష్ కిస్ కూడా పెట్టేవాడిని అని చెప్పేశాడు. కెప్టెన్సీ టాస్కులో ఆనీ మాస్టర్ చేసిన సాయానికి సన్నీ ఎమోషనల్ అయి బుగ్గను కొరికేశాడు.ముద్దు పెట్టేశాడు. ఇంగ్లీష్ ముద్దు కూడా పెడదామని అనుకున్నానంటూ ఆనీ మాస్టర్‌కే చెప్పేశాడు సన్నీ. మొత్తానికి ముద్దుముచ్చట్లతో సన్నీ, ప్రియలు హద్దులు దాటేస్తున్నారు.
