Site icon A2Z ADDA

Arjuna Phalguna Teaser : అభిమన్యుడిని కాదు.. అర్జునుడిని!

శ్రీ విష్ణు సినిమాలు అంటే ప్రేక్షకులకు ఓ మోస్తరు అంచనాలుంటాయి. రెగ్యులర్ ఫార్మాట్ కమర్షియల్ చిత్రాల్లో నటించడు.. కొత్తగా ఏదో ఒకటి ట్రై చేస్తాడనే నమ్మకం ఉంటుంది. అలాంటి శ్రీ విష్ణు హీరోగా అర్జును ఫల్గుణ అనే చిత్రం రాబోతోంది. తాజాగా దీనికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. దాన్ని చూస్తే సినిమా ఎలా ఉండబోతోందనే విషయం అందరికీ అర్థమవుతుంది. ఏదో ఒక సమస్యలు హీరో చిక్కుకోవడం దాన్ని నుంచి బయటకు రావడానికి చేసే ప్రయత్నమే ఈ అర్జున ఫల్గుణ అన్నట్టు కనిపిస్తోంది.

‘నాది కాని కురుక్షేత్రంలో నాకు తెలియని పద్మవ్యూహంలో ఇరుక్కుపోయాను. అయినా నేను బలైపోవడానికి అభిమన్యుడిని కాదు.. అర్జునుడిని’ అంటూ శ్రీవిష్ణు చెప్పిన డైలాగ్‌తో సినిమా నేపథ్యం ఏంటో అర్థమవుతోంది. 65 సెకన్ల టీజర్‌లో యాక్షన్, రొమాన్స్ ఇలా అన్నింటినీ చూపించేశాడు. డేంజర్ జోన్‌లో హీరో ఎంట్రీ ఇచ్చినట్టు.. తనకు అస్సలు సంబంధం లేని సమస్యల్లో హీరో చిక్కుకున్నట్టు కనిపిస్తోంది. అభిమన్యుడిని కాదు అర్జునుడిని అని శ్రీ విష్ణు చెప్పే దాన్ని బట్టి చూస్తే అతడి కారెక్టర్ ఎలా ఉండబోతోందో అర్థమవుతుంది.

Arjuna Phalguna Teaser | Sree Vishnu, Amritha Aiyer | Teja Marni | Matinee Entertainment

ఎన్ ఎమ్ పాషా సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను తేజ మర్ని నిర్వహిస్తున్నారు. పి. సుధీర్ వర్మ మాటలు అందించారు. అర్జున ఫల్గుణ త్వరలోనే థియేటర్‌లోకి రానుంది. ఈ చిత్రంలో అమృతా అయ్యర్, నరేష్, శివాజీ రాజా, సుబ్బ రాజు, దేవీ ప్రసాద్, రంగస్థలం మహేష్, రాజ్ కుమార్ చౌదరి, చైతన్య తదితరులు నటిస్తున్నారు.

Exit mobile version