లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద శ్రీమతి. ముప్పనేని శ్రీలక్ష్మీ సమర్పణలో శివాజీ, నవదీప్, నందు, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో రవింద్ర బెనర్జీ ముప్పనేని నిర్మిస్తున్న చిత్రం ‘దండోరా’. ఈ సినిమాకు మురళీకాంత్ దేవాసోత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను సోమవారం నాడు విడుదల చేశారు.
‘నాలుగు పుస్తకాలు చదివి లోకమంత తెలిసినోడి లెక్క మాట్లాడకు.. నీకు తెలియని లోకం ఇంకోటి ఉంది ఈడ’, ‘చావు అనేది మనిషికిచ్చే ఆఖరి మర్యాద’ అంటూ డైలాగ్స్‌తో ‘దండోరా’ టీజర్ అందరిలోనూ ఆసక్తిని పెంచేసింది. లవ్, కామెడీతో పాటుగా అంతర్గతంగా ఏదో ఓ కొత్త సందేశాన్ని ఇచ్చేలా ‘దండోరా’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టుగా ఈ టీజర్ చెప్పకనే చెప్పేసింది. ఇక ఈ చిత్రంలో శివాజీ, బిందు మాధవి, నవదీప్ వంటి వారు అద్భుతమైన పాత్రల్ని పోషించినట్టుగా కనిపిస్తోంది. విజువల్స్, బీజీఎం ఇలా అన్నీ కూడా ఎంతో నేచురల్‌గా కనిపిస్తున్నాయి. టీజర్‌తో అందరినీ ఆకట్టుకున్నారని మాత్రం తెలుస్తోంది. ఇక ఈ టీజర్ లాంఛ్ కోసం నిర్వహించిన ఈవెంట్‌లో..
శివాజీ మాట్లాడుతూ .. ‘బెన్నీ గారిని చూస్తుంటే నాకు నిర్మాత క్రాంతి కుమార్ గారు గుర్తుకు వస్తుంటారు. దర్శక, నిర్మాతగా క్రాంతి గారు ఎన్నో గొప్ప చిత్రాల్ని తీశారు. ఆయనలానే బెన్నీ గారిలోనూ ఎన్నో మంచి భావాలున్నాయి. మురళీ గారు చెప్పిన కథ విని ఎంతో కనెక్ట్ అయ్యాను. మన సమాజంలోని కుల వ్యవస్థ మీద సెటైరికల్‌గా అద్భుతమైన కథను రాసుకున్నారు. ప్రతీ ఒక్కరి పాత్ర చాలా గొప్పగా ఉంటుంది. బిందు మాధవి గారు అద్భుతంగా నటించారు. తమిళ్, మలయాళీ ఆర్టిస్టులే బాగా నటిస్తారు అని అనుకునే వారికి ఈ సినిమా చూస్తే.. అంతకంటే గొప్ప ఆర్టిస్టులున్నారని అర్థం అవుతుంది. నవదీప్‌కి ఎంతో సత్తా ఉంది. అతన్ని పూర్తి స్థాయిలో ఇంకా ఎవ్వరూ వాడుకోవడం లేదు. అతన్ని కళ్లని దర్శకులు వాడుకోవడం లేదు. నవదీప్ చాలా గొప్ప ఆర్టిస్ట్. నందు కూడా బాగా నటించారు. ఈ ఏడాదిలో గుర్తుంచుకోదగ్గ చిత్రంగా ‘దండోరా’ నిలుస్తుంది. వెంకట్ ఫోటోగ్రఫీ ఈ సినిమాలో అద్భుతంగా ఉంటుంది. బీజీఎం అదిరిపోయింది. అందరం ఎంతో కష్టపడి ఈ సినిమాని చేశాం. ఇది మంచి బిర్యానీలాంటి చిత్రం. నటీనటులందరికీ నటించేందుకు ఎంతో స్కోప్ ఉన్న చిత్రం. నా కారెక్టర్‌లో ఎన్నో వేరియేషన్స్ ఉంటాయి. డిసెంబర్ 25న ఈ చిత్రం రాబోతోంది. ఇది వంద శాతం కమర్షియల్ చిత్రం. పైరసీని ఎంకరేజ్ చేయకండి. అందరూ సినిమాని థియేటర్లోనే చూడండి’ అని అన్నారు.
నవదీప్ మాట్లాడుతూ .. ‘మెదక్ నుంచి అమెరికాకు వెళ్లి జాబ్ చేస్తూ.. అది వదిలి.. సినిమాల్లోకి వచ్చి మురళీ కాంత్ ఈ ‘దండోరా’ని చేశారు. చావు, కులం అనే పాయింట్‌లతో ఎంటర్టైనింగ్‌గా ఎన్నో మంచి విషయాల్ని చెప్పారు. ఏదో నీతిని బోధిస్తున్నట్టుగా అని కాకుండా అందరినీ అలరించేలా ఈ చిత్రం ఉంటుంది. ఇలాంటి కథకు సపోర్ట్‌గా నిలిచిన బెన్నీ గారికి హ్యాట్సాఫ్. ఆడియెన్స్‌గా ఈ సినిమాను మేం చూసినప్పుడు మాకు చాలా నచ్చింది. నటీనటులుగా మేమంతా సంతృప్తి చెందాం. శివాజీ గారి లాంటి సీనియర్ ఆర్టిస్టుల నుంచి కొత్త ఆర్టిస్టుల వరకు అందరూ అద్భుతంగా నటించారు. వారందరితోనూ మురళీ అద్భుతంగా చేయించుకున్నారు. డిసెంబర్ 25న ఈ చిత్రం రాబోతోంది. ఓ మీనింగ్ ఫుల్ సినిమాను తీశామని మాత్రం చెప్పగలను. అందరూ చూసి మీ మీ అభిప్రాయాల్ని చెప్పండి’ అని అన్నారు.
నటుడు నందు మాట్లాడుతూ .. ‘‘దండోరా’ లాంటి కథను నమ్మి నిర్మిస్తున్న బెన్నీ అన్నకు థాంక్స్. కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చిన బెన్నీ అన్నకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. మంచి విషయాల్ని ఎంతో ఎంటర్టైనింగ్‌గా మురళీ అన్న చెప్పారు. శివాజీ, నవదీప్ గార్ల నటన అంటే నాకు చాలా ఇష్టం. వారిద్దరితో కలిసి నటించడం ఆనందంగా ఉంది. డిసెంబర్ 25న మా చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుంది’ అని అన్నారు.
బిందు మాధవి మాట్లాడుతూ .. ‘‘దండోరా’లో ప్రతీ పాత్ర అద్భుతంగా ఉంటుంది. అన్ని కారెక్టర్స్‌కి ఇంపార్టెన్స్ ఉంటుంది. సమాజంలో ఆలోచనలు రేకెత్తించేలా మా ‘దండోరా’ ఉంటుంది. ఎంటర్టైన్ చేస్తూ మంచి విషయాల్ని చెప్పే ప్రయత్నం చెప్పాం. మనం మాట్లాడుకోలేని ఎన్నో టాపిక్స్‌ని ‘దండోరా’ టచ్ చేస్తుంది. కథ విన్న వెంటనే నాకు చాలా నచ్చింది. ఎంతో సున్నితమైన సబ్జెక్ట్‌ను మా దర్శకుడు ఇంకెంతో ఎంటర్టైనింగ్‌గా చెప్పారు. శివాజీ, నవదీప్ గార్లతో మళ్లీ నటించడం ఆనందంగా ఉంది. డిసెంబర్ 25న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
నిర్మాత రవీంద్ర బెనర్జీ ముప్పనేని మాట్లాడుతూ .. ‘‘దండోరా’ టీజర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. సినిమా ఇంతకు మించి అనేలా ఉంటుంది. నాకు సపోర్ట్ చేసిన టీం అందరికీ థాంక్స్. డిసెంబర్ 25న ఈ చిత్రం రానుంది. అందరినీ అలరించేలా మా సినిమా ఉంటుంది’ అని అన్నారు.
దర్శకుడు మురళీకాంత్ మాట్లాడుతూ .. ‘‘దండోరా’ టీజర్‌ను చూసి అల్లు అర్జున్ గారు అభినందించారు. అదే మాకు పెద్ద సక్సెస్. ఈ కథను విన్న వెంటనే సపోర్ట్ చేసిన బెన్నీ అన్నకు థాంక్స్. నన్ను నమ్మి నాతో పాటు నడిచిన నా ఆర్టిస్టులందరికీ థాంక్స్. ఇది చాలా మంచి చిత్రం. డిసెంబర్ 25న ఈ చిత్రాన్ని చూడండి. అందరూ ఎనర్జిటిక్‌గా నటించారు. వాళ్ల నటనతో ఈ చిత్రం నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లింది. ఈ చిత్రంలో అన్ని రకాల అంశాలుంటాయి. ఇలాంటి సందేశాన్ని ఇంత ఎంటర్టైనింగ్‌గా చెప్పారా? అని మూవీని చూసిన తరువాత ఆడియెన్స్ అంతా సర్ ప్రైజ్ అవుతారు. ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.
నటుడు రవికృష్ణ మాట్లాడుతూ .. ‘‘దండోరా’ ఈవెంట్‌కు వచ్చిన మీడియాకు థాంక్స్. టీజర్ అందరికీ నచ్చి ఉంటుందని భావిస్తున్నాను. టీజర్ కంటే సినిమా వంద రెట్లు బాగుంటుంది. డిసెంబర్ 25న మా సినిమాను చూసి ప్రతీ ఒక్కరూ సంతోషిస్తారు. ఓ మంచి ఎమోషన్‌తో తీసిన ఈ చిత్రంలో నాకు మంచి పాత్రను ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. శివాజీ అన్న, నవదీప్, నందు, బిందు మాధవిలతో పని చేయడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.
నటి మౌనిక మాట్లాడుతూ .. ‘మురళీ గారు ‘దండోరా’ కథను అద్భుతంగా రాసుకున్నారు. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ఈ మూవీ అందరినీ కచ్చితంగా ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.
నటి మణిక మాట్లాడుతూ .. ‘‘దండోరా’ సినిమా అద్భుతంగా ఉంటుంది. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన టీంకు థాంక్స్’ అని అన్నారు.
ఎడిటర్ సృజన అడుసుమిల్లి మాట్లాడుతూ .. ‘‘దండోరా’ టీజర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. సినిమా కూడా అంతే అద్భుతంగా ఉంటుంది’ అని అన్నారు.
ఈ సినిమాలోని పాటలు టి సిరీస్ ద్వారా రిలీజ్ అవుతున్నాయి. అథర్వణ భద్రకాళి పిక్చర్స్ సినిమాను ఓవర్‌సీస్ రిలీజ్ చేస్తోంది.
నటీనటులు:
శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు తదితరులు
సాంకేతిక వర్గం:
బ్యానర్: లౌక్య ఎంటర్‌టైన్మెంట్స్, నిర్మాత: రవీంద్ర బెనర్జీ ముప్పనేని, దర్శకత్వం: మురళీకాంత్, సినిమాటోగ్రఫీ: వెంకట్ ఆర్.శాఖమూరి, ఎడిటర్: సృజన అడుసుమిల్లి, సంగీతం: మార్క్ కె.రాబిన్, ఆర్ట్ డైరెక్టర్: క‌్రాంతి ప్రియం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎడ్వర్డ్ స్టెవెన్‌సన్ పెరెజి, కాస్ట్యూమ్ డిజైనర్: రేఖా బొగ్గారపు, లైన్ ప్రొడ్యూసర్: కొండారు వెంకటేష్, ఆడియో: T-సిరీస్, ఓవర్సీస్ రిలీజ్: అథర్వణ భద్రకాళి పిక్చర్స్, పి.ఆర్.ఒ: నాయుడు సురేంద్ర కుమార్- ఫణి కందుకూరి (బియాండ్ మీడియా). మార్కెటింగ్: టికెట్ ఫ్యాక్టరీ
