Site icon A2Z ADDA

వరద బాధితులకు అండగా నిలిచిన తొలి తమిళ హీరో శింబు, తన వంతుగా 6 లక్షల విరాళం ప్రకటించిన శింబు

ఆపదలో వున్న వారికి ఆపన్నహస్తం అందించడానికి బాషా పరిమితులు, ప్రాంతీయ భేదాలు వుండవు. కష్టాల్లో వున్న వారిని ఆదుకోవాలనే మంచి హృదయం వుంటే చాలు. ఇప్పుడు అలాంటి కోవలోకి వస్తాడు తమిళ కథానాయకుడు శింబు. గతంలో కూడా పలుసార్లు తన మంచితనాన్ని సహృదయతను చాటుకున్న ఈ తమిళ కథానాయకుడు మరోసారి తన ఉదారతను చాటాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరద ముంపులో చిక్కుక్కుని సహాయం కోసం ఎదురుచూస్తున్న వరద బాధితులకు కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అహార్నిశాలు శ్రమిస్తూ వారిని ఆదుకుంటున్నారు. ఇక వారి వరద వల్ల సర్వం కోల్పోయిన బాధితుల కోసం హీరో శింబు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి తన వంతు సహాయంగా ఆరు లక్షల విరాళం ప్రకటించారు. వరదల వల్ల త్రీవంగా నష్టం పోవడం తనకు ఎంతో భాదను కలిగిస్తుందని, అందరూ త్వరితగతిన ఈ విపత్తను నుండి బయటపడాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నానని తెలిపారు శింబు.

Exit mobile version