Site icon A2Z ADDA

డబ్బుల కోసం సినిమాలు చేయను – సత్య దేవ్

విజయ్ దేవరకొండ, సత్య దేవ్, భాగ్య శ్రీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కింగ్డమ్’. ఈ మూవీని సితార బ్యానర్ మీద నాగవంశీ నిర్మించగా.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. ఈ గురువారం విడుదలైన చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం బ్లాక్ బస్టర్ దిశగా వెళ్తున్న ఈ మూవీ విశేషాలు చెప్పేందుకు సత్య దేవ్ మీడియా ముందుకు వచ్చారు.

ఈ క్రమంలో కింగ్డమ్ గురించి సత్య దేవ్ చాలా విషయాల్ని పంచుకున్నారు. కింగ్డమ్‌లోని తన పాత్రలో ఎన్నో లేయర్స్ ఉంటాయని, ఆ పాత్రలోని సంఘర్షణే తనకు నచ్చిందని అన్నారు. ఇలాంటి పాత్రను మిస్ అయితే ఏదో కోల్పోయాననే భావన వస్తుందని, అందుకే కథ విన్న వెంటనే ఒప్పుకున్నానని సత్య దేవ్ అన్నారు.

సత్య దేవ్‌కి గాడ్ ఫాదర్ తరువాత చాలా ఆఫర్లు వచ్చాయట. కానీ అన్నీ కూడా ఒకే రకంగా ఉండటం, ఒకే రకమైన విలనిజం ఉన్న కారెక్టర్లు దక్కడంతో అన్నింటికీ నో చెప్పుకుంటూ.. మళ్లీ ఓ కొత్త కారెక్టర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారట. అలా తన చిత్రాలు తాను చేసుకుంటూ హీరోగా బిజీగా ఉన్నా కూడా ఇలాంటి స్పెషల్ కారెక్టర్లు వస్తే చేస్తానని అన్నారు.

కేవలం డబ్బు కోసమే తాను సినిమాలు చేయలేనని చెప్పుకొచ్చారు. డబ్బు కోసమే సినిమాలు చేయాలనే పరిస్థితి వస్తే.. ఇంటికి వెళ్లి వ్యవసాయం చేసుకుంటాను అని సత్య దేవ్ చెప్పుకొచ్చారు. తనకు నచ్చిన, మెచ్చిన పాత్రలే చేసుకుంటూ వెళ్తానని సత్య దేవ్ అన్నారు.

 

Exit mobile version