Site icon A2Z ADDA

Sarayu: కాలు ఎత్తి ** మీద తన్నేసిన సరయు.. ఎక్స్ ప్రెస్ హరికి తీవ్ర అవమానం

Sarayu Beaten Express Hari In Comedy Stars

Sarayu బిగ్ బాస్ ఇంట్లో సరయు ఉన్నది ఒక్క వారమే అయినా ఇంపాక్ట్ మాత్రం గట్టిగానే చూపించింది. సోషల్ మీడియా, యూట్యూబ్‌ను ఎక్కువగా ఫాలో అయ్యే వారికి సరయు గురించి తెలుస్తుంది. ఆమె మాట్లాడే మాటలు, వేసే డబుల్ మీనింగ్ డైలాగ్‌లకు చెవుల్లోంచి రక్తం కారుతుంది. అంతలా పచ్చి బూతులతో పిచ్చెక్కిస్తుంటుంది. అలాంటి సరయు బిగ్ బాస్ ఇంట్లోకి వస్తుందంటే అందరూ ముందుగా భయపడ్డారు. షో మొత్తం బీప్ వేసుకోవాల్సిందేనా? అని అనుకున్నారు.

కానీ దానికి భిన్నంగా సరయు ప్రవర్తించింది. ఎవ్వరితోనూ ఎక్కడా గొడవలకు దిగలేదు. ఎక్కువగా మాటలు తూలలేదు. కానీ కాజల్ విషయంలో మాత్రం దుమ్ములేపింది. నీ పుట్టలో వేలు పెట్టను అంటూ దారుణంగా అనేసింది. ఆ ఒక్క డైలాగ్‌తో సరయు ఏంటో అర్థమైపోయింది. అలా సరయు సిగరెట్లు తాగడం, ఎక్కువగా టాస్కుల్లో ఇన్వాల్వ్ అవ్వకపోవడంతో మొదటి వారంలోనే ఎలిమినేట్ అయింది. అయితే తాజాగా సరయు బుల్లితెర మీద గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది.

బిగ్ బాస్ కంటెస్టెంట్లకు కామెడీ స్టార్స్ అడ్డాగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా సరయు ఎంట్రీ ఇచ్చింది. వచ్చే వారం రానున్న ఎపిసోడ్ ప్రోమో తాజాగా సోషల్ మీడియాలోకి వచ్చింది. అందులో సరయు రెచ్చిపోయింది. ఎక్స్ ప్రెస్ హరికి వాచిపోయింది. చెంపదెబ్బలు పడ్డాయి. చివరకు కాలు ఎత్తి బ్యాక్ మీద తంతే ఎగిరి అవతలపడ్డాడు హరి. అలా సరయు ప్రోమోల్లోనే దుమ్ములేపింది. ఇక ఎపిసోడ్‌లో హరిని ఎలా ఆడుకుందో చూడాలి.

Exit mobile version