Site icon A2Z ADDA

Puneeth Rajkumar: కన్నడ స్టార్ కన్నుమూత.. పునీత్ రాజ్‌కుమార్ ఇకలేరు

Sandalwood Superstar Puneeth Raj Kumar No More

Sandalwood Superstar Puneeth Raj Kumar No More

Puneeth Rajkumar కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్(46) కాసేపటి క్రితమే మరణించారు. కన్నడ ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్న పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో కాసేపటి క్రితమే తుది శ్వాస విడిచారు. పునీత్ మరణ వార్తతో టాలీవుడ్ కోలీవుడ్ శాండల్ వుడ్ సెలెబ్రిటీలంతా కూడా దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ కేవలం కన్నడ ఇండస్ట్రీలోనూ సినిమాలు తీసినా కూడా టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.

ఈ ఏడాది యువరత్న అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి హిట్ కొట్టాడు. అయితే నేటి ఉదయం గుండె పోటు రావడంతో హాస్పిటల్‌లో చేర్చించారు. కాసేపటి క్రితమే ఆయన తుది శ్వాస విడిచారు. ప్రముఖ నటులు రాజ్ కుమార్ వారసత్వంగా పునీత్ రాజ్ కుమార్, శివరాజ్ కుమార్‌లు కన్నడ ఇండస్ట్రీని ఏలేస్తున్నారు. ఇక పునీత్ కేవలం నటుడిగానే కాకుండా సింగర్, హోస్ట్, నిర్మాత ఇలా పలు విభాగాల్లో తన కంటూ ఓ గుర్తింపును సాధించాడు.

సెలెబ్రిటీలందరూ కూడా పునీత్ రాజ్ కుమార్ పునీత్ రాజ్ కుమార్ మరణం పట్ల తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. కోలీవుడ్, టాలీవుడ్ బాలీవుడ్ అని తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ రియాక్ట్ అవుతున్నారు. ఆత్మకు శాంతి చేకూరాలని ట్వీట్లు పెడుతున్నారు. రాధిక, కుష్బూ, సిద్దార్థ్, ఆర్జీవీ, సోనూ సూద్ వంటి వారు స్పందిస్తున్నారు.

Exit mobile version