Site icon A2Z ADDA

తినడం కోసమే ఆ పని.. సమంత మాముల్ది కాదు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంత ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లలో ఎంతో బిజీగా ఉన్నారు. సమంత విడాకులు ప్రకటన తర్వాత పూర్తిగా తన దృష్టిని సినిమాలపై పెట్టింది. ఈ క్రమంలోనే హాలీవుడ్ టాలీవుడ్ అంటూ వరుస అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా గడుపుతున్నారు. సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉండే సమంత తన ఫిట్ నెస్ గురించి కూడా ఎంతో శ్రద్ధ తీసుకుంటారు.

ఈ క్రమంలోనే సమంత ఎన్నోసార్లు జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్నటువంటి ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా సమంత ఇలాంటి వర్కౌట్స్ చేస్తున్నటువంటి ఫోటోని తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోని షేర్ చేస్తూ సమంత తినడం కోసమే ఈ పని అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం సమంత ఈ వర్కౌట్ కి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రతి ఏడాది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం నాగచైతన్య తో కలిసి సమంత గోవా వెళ్ళేది. అయితే ప్రస్తుతం వీరు విడాకులు తీసుకోవడం వల్ల సమంత తన స్నేహితురాలు శిల్పా రెడ్డి, ఇతరులతో కలిసి గోవా వెకేషన్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా గోవాలోనే జరుపుకోనున్నట్లు తెలుస్తోంది. సమంత గోవా వెకేషన్ కి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.

Exit mobile version