Site icon A2Z ADDA

ఆ విషయం నన్ను ఎందుకు బాధిస్తోంది?.. సమంత

సమంత ప్రస్తుతం ఫుల్ ఖుషీగా ఉంది. తనకు నచ్చినట్టుగా జీవితాన్ని ఆస్వాధిస్తోంది. ఈ ఏడాది అంతా మంచి ఎదురవ్వాలి.. మంచి కోసం ఎదురుచూస్తున్నాను అంటూ యూనివర్స‌కి సమంత సందేశం ఇచ్చింది. అయితే సమంత కోరుకున్నట్టుగా ఈ ఏడాది అంతా మంచే జరుగుతుందా? లేదా? అన్నది చూడాలి. ఇప్పటికి అయితే సమంత మాత్రం ఫుల్ స్పీడు మీదుంది.

ఈ మధ్య పుష్ప ఐటం సాంగ్‌తో గ్లోబల్ వైడ్‌గా పాపులర్ అయింది. ఊ అంటావా మామా ఊ ఊ అంటావా అనే పాటతో సమంత ఒక్కసారిగా అందరినీ తన వైపుకు తిప్పుకుంది. మొత్తానికి సమంత తన కెరీర్‌లో చేసిన మొట్టమొదటి ఐటం సాంగ్ ఇలా ఖండాలను దాటేసింది. ఇక ఇప్పుడు సమంత హాలీవుడ్, బాలీవుడ్ ప్రాజెక్ట్‌ల మీద దృష్టి పెట్టేసింది.

ఆల్రెడీ యశోద అనే సౌత్ సినిమాను చేసేస్తోంది. డ్రీమ్ వారియర్స్ బ్యానర్ మీద మరో సినిమా రెడీగా ఉంది. హలీవుడ్ డైరెక్టర్‌తో ఇంకో సినిమా కన్ఫామ్ అయింది. బాలీవుడ్ స్టార్ హీరోతో మరో చిత్రం చర్చల్లో ఉంది. మొత్తానికి సమంత ఊపు మాత్రం మామూలుగా లేదు. తాజాగా సమంత ఓ పోస్ట్ చేసింది.

బ్లాక్ బెర్రీ ఫోన్‌లంటే ఒకప్పుడు అందరికీ మోజు ఉండేది. వాడిని వాడటం కూడా ఓ ప్రెస్టీజియస్‌గా ఫీలయ్యేవారు. ఆ మోడల్స్ కూడా అందరినీ ఆకట్టుకునేలా ఉండేవి. ఇప్పుడు ఆ ఫోన్‌లు బ్యాన్ అయిపోతున్నాయట. దీంతో సమంతకు బాధగా అనిపిస్తోందట. ఎందుకు బాధగా అనిపిస్తోందంటూ సమంత ఫీలయ్యింది. అంటే సమంతకు ఆ ఫోన్‌లంటే చాలా ఇష్టమన్న మాట.

Exit mobile version