Samantha-Naga Chaitanya సమంత నాగ చైతన్యల విడాకుల అంశం ఇప్పటికీ నడుస్తూనే ఉంది. అక్టోబర్‌లో ఈ జంట అధికారికంగా విడిపోయింది. సెప్టెంబర్ నెల నుంచే విడాకుల రూమర్లు బయటకు వచ్చాయి. అయితే సమంతపై అక్టోబర్ నెలలో వచ్చినన్నీ రూమర్లు మరేతర హీరోయిన్ మీద వచ్చి ఉండవు. విడాకుల తరువాత సమంతను దారుణంగా ట్రోల్ చేశారు. అక్రమ సంబంధాలు అంటగట్టారు, అబార్షన్లు చేసుకుందని అన్నారు, డబ్బు కోసం పెళ్లి చేసుకుందని ఆరోపణలు చేశారు.
వాటిపై సమంత గట్టిగానే స్పందించింది. కానీ నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న విషయంపై నేరుగా ఎక్కడా కూడా స్పందించలేదు. కానీ తాజాగా ఫిల్మ్ ఫేర్ ఓటీటీ సంస్థతో సమంత తన పర్సనల్ విషయాల మీద స్పందించింది. జీవితంలో 2021 సంవత్సరం ఇలా ఉంటుందని సమంత అస్సలు ఊహించలేదట. జీవితంలో మనం అనుకోని సమస్యలు ఎదురవుతుంటాయి.. వాటిని అర్థం చేసుకుని ముందుకు వెళ్లాలి.. అంగీకరించాల్సి ఉంటుంది. ఓ పనిని మధ్యలోనే వదిలేయాల్సి వచ్చినప్పుడు వాటిని మనం అంగీకరించకపోతే.. నిత్య పోరాటం చేయాల్సి ఉంటుంది.
నా జీవితంలో కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి. అయినా సరే నా జీవితాన్ని ముందుకు కొనసాగించాల్సిందే. ఆ విషయం నాకు తెలుసు. నేను ఎంత స్ట్రాంగ్ పర్సన్ అన్నది తలుచుకుంటే నాకే ఆశ్చర్యం వేస్తోంది. నాలో ఇంత సామర్థ్యం ఉందని నాకు తెలియదు. నాలో నాకు ఇంత శక్తి, బలం ఉందని తెలియదు. ఆ విషయం తెలిశాక నాకు గర్వంగా ఉంది.
నాగ చైతన్యతో విడాకులు అయ్యాక నేను చచ్చిపోతానేమో అని అనుకున్నాను. కానీ ధైర్యంగా నిలబడ్డాను అంటూ విడాకుల అంశం మీద మొత్తానికి సమంత నోరు విప్పింది. అయితే సమంత మాత్రం విడాకుల తరువాత ఇన్ అండ్ అవుట్ ఇంకా బలంగా తయారైందని మాత్రం అర్థమవుతోంది.