Samantha సమంత తన ఫ్రెండ్స్‌తో ఎంత సరదగా ఉంటుంది.. ఎంత సంతోషంగా ఉంటుందో చూస్తూనే ఉన్నారు. విడాకుల బాధ ఏ కోశాన కూడా కనిపించడం లేదు. అయితే నాగ చైతన్య సమంత ఎప్పటి నుంచో దూరంగానే ఉంటున్నారని కాకపోతే ఇప్పుడు అధికారికంగా ప్రకటించారని కొందరు అంటున్నారు. అంతా బాగానే ఉంది. ఆగస్ట్ వరకు అంతా ఓకే అన్నట్టుంది. కానీ ఆ తరువాతే ఏమైందో అంటూ ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. గుణ శేఖర్ కూతురు నీలిమ గుణ చెప్పిన దాని ప్రకారం.. ఆగస్ట్‌లో సమంత పిల్లలను కనేందుకు రెడీ అయిందట.
అందుకే సినిమాను త్వరగా ఫినిష్ చేయాలని ముందే కండీషన్ పెట్టేసిందట. అయితే ఆగస్ట్ నెల వరకు ఈ విడాకుల వ్యవహారం అంతగా బయటకు రాలేదు. సెప్టెంబర్ నెల అంతా కూడా ఈ విడాకుల రూమర్లు ఎక్కువయ్యాయి. చివరకు అక్టోబర్ మొదటి వారంలో అంటే పెళ్లి రోజు కంటే ముందే విడాకులను అధికారికంగా ప్రకటించేశారు. అలా ఒక్కసారిగా రూమర్లకు బ్రేక్ చెప్పేశారు. అధికారికంగా వేరు పడ్డామని ప్రకటించేశారు.
అయితే అప్పటి నుంచి సమంత తన ఫ్రెండ్స్ సాధన, ప్రీతమ్, శిల్పా రెడ్డిలతో కలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. రోజుకో రకమైన కొటేషన్ పెడుతూ హల్చల్ చేస్తోంది. తాజాగా సమంత ఓ వీడియోను షేర్ చేసింది. అందులో సాధన గురించి చెప్పింది. ఓ రెండు జంతువులుంటాయి ఆ వీడియోలో. ఒకటి హాయిగా నిద్రపోతోంటే.. ఇంకోటి మాత్రం కావాలని నిద్రలేపుతుంది. ఎందుకు లేపుతున్నావ్ అంటూ కోపం అరుస్తుంది. నా మీదకే అరుస్తావా? అంటూ లాగి పెట్టి ఒకటి కొట్టేసింది ఇంకో జంతువు. అలా తామిద్దరం కూడా ఉంటామని సాధన గురించి సమంత చెప్పింది.
