సమంత ప్రస్తుతం కొటేషన్లతోనే తన అభిప్రాయాలను పంచుకుంటోంది. ఏం చెప్పాలని ఉన్నా కూడా ఎక్కడిదో ఓ కొటేషన్ తీసుకొస్తోంది. తన ఇన్ స్టా స్టోరీలో పెట్టేస్తోంది. అది ఎవరిని ఉద్దేశించి పెడుతుంది.. ఎందుకు పెడుతుందన్న విషయాలేవీ తెలియడం లేదు. కానీ సమంత మాత్రం రోజూ ఏదో ఒక కొటేషన్ పెడుతూనే ఉంది. విడాకుల అనంతరం సమంత మరీ దారుణంగా కొటేషన్ల మీద కొటేషన్లు పెడుతోంది. ప్రేమ, విరహం, బాధ, తప్పొప్పుల గురించి ఇలా ఏదేదో పోస్ట్‌లు పెడుతూనే ఉంది.
కర్మ అంటుంది.. ప్రేమ ఉంటుంది. క్షమించాలి అంటుంది.. కలిసి ఉండాలంటుంది.. నిజం ఎప్పటికీ దాగదు.. నిజాయితీగా ఉండాలని అంటుంది.ఇలా సమంత ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటుంది. అలా తనలోని భావాలను ఇలా కొటేషన్ల రూపంలో చెప్పేస్తున్నట్టు కనిపిస్తోంది. ఎక్కువగా సద్గురు చెప్పే కొటేషన్లను షేర్ చేస్తుంటుంది. తాజాగా సద్గురు చెప్పిన మరో కొటేషన్‌ను షేర్ చేసింది.
అసలే సద్గురు, ఈషా ఫౌండేషన్‌ను సమంత ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటుంది. తాజాగా సద్గురు చెప్పిన ఓ కొటేషన్‌ను సమంత షేర్ చేసింది. పక్క వాళ్ల గురించి, వాళ్లేం చేస్తున్నారో పట్టించుకోవాల్సిన అవసరం లేదు.. నీ పని ఏంటో నువ్ చూసుకో.. నీ జీవితానికి ఏం కావాలో అది చూసుకో అని ఆ కొటేషన్ మీనింగ్. అంటే ఇప్పుడు సమంత ఈ మాటలు ఎవరికి చెబుతుందో మరి. మొత్తానికి సమంత మాత్రం ప్రస్తుతం రెండు ద్విభాష చిత్రాలను లైన్‌లో పెట్టేసింది. ఇక బాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం సమంత తెగ కష్టపడుతోంది.