Site icon A2Z ADDA

మున్ముందు మంచి రోజులున్నాయ్.. సమంత కామెంట్స్ వైరల్

సమంత ప్రస్తుతం కొటేషన్లతోనే తన మనసులోని మాటలను చెప్పేస్తోంది. మామ్ సెయిడ్ అంటూ అమ్మ చెప్పిన మాటలంటూ ఎన్నో కొటేషన్లను సమంత చెప్పింది. ప్రేమ, స్నేహం, నమ్మకం, మోసం ఇలా ఎన్నో విషయాల మీద సమంత కొటేషన్లు షేర్ చేసింది. అయితే ఇప్పుడు ఎందుకు ఇలాంటి కొటేషన్లు చెబుతుంది.. ఎవరి గురించి చెబుతుంది? అనే విషయాలు అందరినీ ఆలోచనల్లో పడేస్తుంటాయి. కానీ సమంత మాత్రం అసలు విషయం చెప్పడం లేదు.

ఆ కొటేషన్లు ఎందుకు షేర్ చేస్తుంటుందో.. అసలు ఆమె ఉద్దేశ్యం ఏంటో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. మొత్తానికి నాగ చైతన్యతో విడాకులు అయిన తరువాత మాత్రం చాలా మార్పులు వచ్చాయి. సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అవుతోంది. మిగతా సినిమాల మీద, వాటి టీజర్లు, పాటలు, పోస్టర్ల మీద కూడా కామెంట్ చేస్తోంది. తనకు అవార్డులు, రివార్డులు, గుర్తింపులు వస్తుండటంతో తెగ సంబర పడిపోతోంది. మొత్తానికి సమంత మాత్రం ఇప్పుడు ఫుల్ బిజీగా గడిపేస్తోంది.

సమంత తాజాగా ఓ కొటేషన్‌ను షేర్ చేసింది. ఓ బిల్డింగ్ గోడ మీద రాసి ఉన్న కొటేషన్‌ను షేర్ చేసింది. మున్ముందు ఎప్పుడూ కూడా మంచి రోజులు వస్తూనే ఉంటాయి. అది ఎప్పటికీ గుర్తు పెట్టుకోండి అని పాజిటివిటిని పెంచేలా సమంత ఆ కొటేషన్‌ను షేర్ చేసింది. అంటే ఇప్పుడు తన జీవితం గురించి చెప్పిందా? లేదా జనరలైజ్ చేసి చెప్పిందా? అన్నది తెలియడం లేదు. మొత్తానికి సమంత మాత్రం ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ కాన్సెప్ట్‌లతోనే బిజీగా ఉంది.

తమిళ, తెలుగు భాషల్లో ఓ రెండు సినిమాలను చేస్తోంది. ఇక బాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. గోవాలో జరిగే వేడుకల్లో స్పీకర్‌గా సమంత పాల్గొనబోతోంది. మొత్తానికి ఇలా సమంత ఎప్పుడూ కూడా ట్రెండింగ్‌లోనే ఉంటోంది.

Exit mobile version