Samantha సమంత మొన్నటి వరకు తీర్థయాత్రలో మునిగింది. ఛార్ ధామ్ యాత్రలోని విశేషాలు తెలుసుకుని పులకించిపోయింది. హిమాలయాల విశిష్టతను తెలుసుకుని అబ్బురపడింది. ఎన్నో అద్భుతాలు, రహస్యాలు ఉన్నాయంటి చెప్పింది. మనుషులు చేదించలేని రహస్యాలున్నాయని సమంత తెలిపింది. అలా ఛార్ ధామ్ యాత్రలోని విశేషాలన్నంటిని సమంత చెప్పుకొచ్చింది. ఛార్ ధామ్ యాత్ర ఎలా చేయాలో శిల్పా రెడ్డి క్షణ్ణంగా చెబితే సమంత కూడా వాటిని షేర్ చేసింది.
అయితే కేదార్ నాథ్ వంటి చోట కాలినడక వెళ్లాల్సి ఉంటుంది. అలా కాలినడక వెళ్తూ అక్కడి విశేషాలను చెప్పుకొచ్చింది. అక్కడ పెన్నులు అమ్ముకునే ముసలి వ్యక్తి గురించి పోస్ట్ చేసింది. తాను అడుక్కోవడం లేదు.. ఈ పెన్నులు కోనుక్కోండి అని తన జీవనోపాధి గురించి సమంత చూపించింది. అంతే కాకుండా సమంత ఇక్కడ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. నేత కార్మికులకు అండగా సమంత నిలుస్తుంటుంది.
అలానే కాశ్మీర్‌లోనూ అలాంటి ఓ ప్రత్యేక వస్త్రాలున్నాయట. అవి ఏ జంతువులకు హాని చేసి తయారు చేయలేదట. ఎంతో సహజ సిద్దమైనవి అని చెబితూ.. వాటిని ప్రమోట్ చేసింది. తన ఇన్ స్టా స్టోరీలో దుసాలా కాశ్మీర్ అంటూ ఆ వస్త్రాల గురించిచెప్పింది. ఆ యాత్రలో దాదాపు అక్కడి వారు తయారు చేసిన వస్త్రాలనే ధరించేసింది సమంత. అలా మొత్తానికి సమంత అక్కడి వారికి బాగానే ప్రమోషన్ కల్పించింది. అలా సమంత తన మంచి మనసును చాటుకుంది.