సమంతకు ప్రస్తుతం ఫిల్మ్ కాంపానియన్ అనే సంస్థ అరుదైన గుర్తింపును ఇచ్చింది. ఫ్యామిలీ మెన్ సీజన్ 2తో సమంత నేషనల్ స్టార్ అయిందని, అత్యంత ప్రభావిత శీలుర జాబితాలో చోటు సంపాదించిందని ఫిల్మ్ కాంపానియన్ అనే సంస్థ ప్రకటించింది. సినిమా రంగంలో ఫిల్మ్ కాంపానియన్‌కు ఉన్న గౌరవం తెలిసిందే. అలాంటి సంస్థ తనను గుర్తించి, గౌరవించడం, ఇలా టాప్ 20లో చోటు ఇవ్వడంపై సమంత స్పందించింది. ఆ సంస్థకు సమంత ధన్యవాదాలు తెలిపింది.
ఇలాంటి ప్రశంసలు వచ్చినప్పుడే తమలో ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుందని సమంత అంది. ఇలాంటి వచ్చినప్పుడు, గుర్తింపు లభించినప్పుడే నేను చేసేది రైట్ అని, సరైన దారిలోనే వెళ్తున్నాను అని అనిపిస్తుందని సమంత చెప్పుకొచ్చింది. అంటే మొత్తానికి సినిమా కెరీర్ ఎంచుకోవడమే మంచి చాయిస్ అని సమంత చెప్పకనే చెప్పేసింది. అందుకే ఇలా పర్సనల్ లైఫ్‌ను సమంత దూరం పెట్టేసింది. నాగ చైతన్యతో విడాకులు తీసుకుందా? అనే అనుమానాలు వస్తున్నాయి.
Thankyou @FilmCompanion
https://t.co/0sAQysVl7m — Samantha (@Samanthaprabhu2) November 13, 2021
ఫ్యామిలీ మెన్ సీజన్ 2తో గొడవలు వచ్చినట్టు టాక్ వినిపించింది. లేదంటే అంతా సరిగ్గా సాగుతుండగా.. సమంత ఫ్యామిలీ ప్లానింగ్ కూడా చేసిందని, శాకుంతలం త్వరగా పూర్తి చేయాలని కండీషన్లు పెట్టడం ఏంటి, ఆగస్ట్‌లో తాను పర్సనల్ విషయాలతో బిజీగా ఉంటానని, పిల్లలను కనే ప్లానింగ్‌లోఉన్నానంటూ చెప్పడం ఏంటి. చివరకు అక్టోబర్‌లో విడిపోవడం ఏంటి? ఈ ప్రశ్నలకు ఇంత వరకు ఎవ్వరికీ కూడా సమాధానం దొరకడం లేదు. ఎందుకు విడిపోయారన్నది కూడా ఎవ్వరికీ అంతు పట్టడం లేదు. మొత్తానికి సమంత మాత్రం ఇలా ఫ్యామిలీ మెన్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది.