Samantha సమంత ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం మీద అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. తన మీద తప్పుడు ఆరోపణలు, పిచ్చి కూతలు కూస్తున్నారంటూ సమంత ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో తన మీద రకరకాలు వార్తలు వస్తున్నాయని, అఫైర్లు ఉన్నాయని, అబార్షన్ చేయించుకున్నాను అని, అవకాశవాదిని అంటూ ఇలా నా మీద వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు.. అయినా నేను ధైర్యంగా నిలబడతాను అంటూ సమంత చెప్పుకొచ్చింది.
అయితే తన మీద తప్పుడు కథనాలు ప్రచారం చేసిన మూడు యూట్యూబ్ చానెల్‌లకు సమంత షాక్ ఇచ్చింది. డాక్టర్ సీవీఎల్ వెంకట్రావ్ మాట్లాడిన మాటలు, వాటిని ప్రసారం చేసిన యూట్యూబ్ చానెల్ల మీద సమంత కేసులు పెట్టింది. బుధవారం నాడు వీటిపై విచారణ కూడా జరిగింది. అలా మొత్తానికి సమంత వేసిన ముందడుగుతో కనీసం కొంతైనా ఈ నెగెటివిటీ, ఈ రూమర్లు తగ్గిపోతాయి. యూట్యూబ్ చానెళ్లకు కాస్త భయం పట్టుకుంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
తప్పుడు కథనాలు రాస్తూ, తప్పుడు థంబ్ నెయిల్స్ పెడుతూ తమ పబ్బం గడుపుకుంటున్న యూట్యూబ్ చానెళ్లకు ఇలాంటి చర్యలే సరైనవి అని సమంతకు నెటిజన్లు అండగా నిలుస్తున్నారు. మొత్తానికి సమంత మాత్రం మంచి పనే చేసిందని అంతా అంటున్నారు. ఇక సమంత మున్ముందు ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను అనౌన్స్ చేసిన సమంత అందరినీ ఆశ్చర్యపరిచింది. అవి రెండూ కూడా ద్విభాష చిత్రాలే కావడం స్పెషల్.