సమంత ప్రస్తుతం అవార్డులు, రివార్డులు తీసుకునే బిజీలో ఉంది. తన పర్సనల్ జీవితాన్ని పూర్తిగా పక్కన పెట్టేసింది. ఇప్పుడంతా కూడా సినిమాల మీదే ఫోకస్ పెట్టింది. నాగ చైతన్యతో విడాకులయ్యాక సమంత మరింత దూకుడు పెంచేసింది. ఎంతటి ట్రోలింగ్ ఎదురైనా, ఎవరెన్ని రకాలుగా మాట్లాడుకున్నా కూడా సమంత మాత్రం ధైర్యం నిలబడింది. ముందుకు సాగుతోంది.
అయితే తనలో ఇంత ధైర్యముందని తనకు తెలియదట.. చైతన్యతో విడాకులు అయితే చచ్చిపోతాను అని అనుకుందట. కానీ ధైర్యం నిలబడటంతో తన మీద తనకే ఎంతో గౌరవం వచ్చిందట. మొత్తానికి సమంత మాత్రం ఒంటరిగా బతికేందుకు ఇప్పుడు నిర్ణయం తీసుకుంది. తన మీద వచ్చిన రూమర్లన్నంటిని ఖండించింది. అక్రమ సంబంధాలు అంటగట్టినా వాటిని తిప్పి కొట్టేసింది.
అయితే సమంత మళ్లీ ఇంత వరకు విడాకుల అంశం గురించి గానీ నాగ చైతన్య గురించి గానీ ఎక్కడా స్పందించలేదు. అంతే కాకుండా నాగ చైతన్యకు తప్పా మిగిలిన అందరికీ బర్త్ డే విషెస్ చెబుతోంది.నాగ చైతన్య సినిమాలకు తప్పా మిగతా హీరోల సినిమాలపై స్పందిస్తోంది. ట్వీట్లు వేస్తోంది. మరీ ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా మీద, రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళిల మీద ట్వీట్లు వేస్తోంది.
అయితే తాజాగా ఓ జాతీయ మీడియాతో సమంత మాట్లాడుతూ తన విడాకుల అంశం మీద ఓపెన్ అయింది. విడాకుల గురించి ఆల్రెడీ ఒక సారి మాట్లాడేశాను. అది అయిపోయింది. ఆ విషయం గురించి ఒకసారి మాట్లాడటం నా బాధ్యత, అది కరెక్ట్. కానీ మళ్లీ మళ్లీ దాని గురించి మాట్లాడాల్సిన పని లేదు. మాట్లాడాల్సిన అవసరం లేదంటూ కాస్త గట్టిగానే సమంత స్పందించింది.