Site icon A2Z ADDA

మొత్తానికి సంతోషాన్ని వెతుక్కుందన్న మాట!.. సమంత కామెంట్స్ వైరల్

సమంత ప్రస్తుతం మంచి ఫాంలో ఉంది. తన వేషధారణను పూర్తిగా మార్చేసింది. హెయిర్ స్టైల్ మార్చేసింది. పొట్టి బట్టల్లో పిచ్చెక్కించింది. బాల్కనీలో నిల్చుని వేసిన స్టెప్పులు వైరల్ అవుతున్నాయి. అలా సమంత ఇప్పుడు మంచి ఊపులో ఉంది. ఫుల్ హ్యాపీగా కనిపిస్తోంది. సమంత తన సంకెళ్లను తెంచుకుని విహరిస్తున్నట్టుంది. ఇన్నాళ్లు బంధీఖానాలో ఉండి.. బయటకు వచ్చిన పక్షిలా ఎగిరిపోతోంది. అయితే సమంత తాజాగా ఓ కొటేషన్ షేర్ చేసింది. దాన్ని బట్టి సమంత ఎంతో సంతోషంగా ఉందో అర్థమవుతోంది.

మన సంతోషం ఎక్కడో ఉండదు.. అది మనలోనే ఉంటుంది.. మనలోనే మన సంతోషాన్ని వెతుక్కోవాలి.. మన దగ్గరే ఉంటుందనే ఉద్దేశ్యాన్ని చెప్పే కొటేషన్‌ను సమంత షేర్ చేసింది. అంటే ఇప్పుడు సమంత తన సంతోషాన్ని వెతుక్కుంది. తనలోని సంతోషాన్ని కనుక్కుని హ్యాపీగా ఉన్నట్టు చెప్పేస్తోందా? లేదా ఇది జనరల్‌గా అందరినీ ఉద్దేశించి ఓ సూక్తిలా చెబుతుందా? అన్నది అర్థం కావడం లేదు. మొత్తానికి సమంత వేసిన ఆ పోస్ట్ మాత్రం వైరల్ అవుతోంది.

రెండు బొమ్మలు మాట్లాడుకుంటూ ఉంటాయి. అందులో ఒక బొమ్మకు హ్యాపీనెస్ అనే బోర్డ్ తగిలి ఉంటుది. ఆ బొమ్మ దాన్ని పట్టుకుని ఉంటుంది. ఇంకో బొమ్మ ఇలా అడుగుతుంది.. హేయ్ ఇది నీకు ఎక్కడ దొరికింది.. దాని కోసం నేను ఎక్కడెక్కడో వెతికాను అని అంది. ఇక రెండో బొమ్మ ఇలా సమాధానం ఇచ్చింది.. దీన్ని నేను నాలోనే సృష్టించుకున్నాను అంటుంది. అంటే సంతోషం ఎక్కడో ఉండదు.. మనలోనే ఉంటుంది.. మనమే దాన్ని క్రియేట్ చేసుకుంటామని చెప్పేసింది. అంటే ఇప్పుడు సమంత తన సంతోషాన్ని వెతుక్కుందని, హ్యాపీగా ఉందని చెప్పేసినట్టుంది.

Exit mobile version