Site icon A2Z ADDA

Samantha: నా హృదయంలో ఎప్పటికీ ప్రత్యేక స్థానం.. సమంత ఎమోషనల్

Samantha Ruth Prabhu About Himalayas And Chardham Yatra

Samantha సమంత తీర్థయాత్రల్లో బిజీగా ఉందన్న సంగతి తెలిసిందే. గత రెండు మూడు రోజులుగా సమంత తన స్నేహితురాలు శిల్పా రెడ్డితో కలిసి చార్ ధామ్ యాత్రకు బయల్దేరిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రిషికేష్, గంగాతీరంలాంటి ప్రాంతాల్లో సమంత ప్రశాంతంగా గడిపింది. ఇక ఈ టూర్‌కు సంబంధించిన విశేషాలను సమంత ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే వచ్చింది.

తాజాగా ఈ యాత్ర ముగిసిందని సమంత చెప్పుకొచ్చింది. యమునోత్రి, గంగోత్రి, కేదార్ నాత్, బద్రీనాథ్‌లను చుట్టి వచ్చాను అని తెలిపింది. హిమాలయాలు ఎప్పటికీ ప్రత్యేకమేనని పేర్కొంది. మహా భారతం చదివిన క్షణం నుంచి ఈ భూమ్మీదున్న హిమాలయాలను చూడాలనే కోరిక పుట్టింది. ఎన్నో రహస్యాలకు ఇది నిలయం. దేవుళ్లు కొలువైన స్థలం. ఇక్కడెన్నో అద్భుతమైన సంగతులున్నాయి.


ఊహా ప్రపంచానికి, వాస్తవ ప్రపంచానికి మద్యలో ఉండే సంఘర్షణ ఇక్కడ కనిపిస్తుంది. ఇదెంతో అద్భుతంగా ఉంది. నా హృదయంలో ఎప్పటికీ హిమాలయాలకు ప్రత్యేకస్థానం ఉంటుంది. ఇక మరీ ముఖ్యంగా ఈ యాత్రలో శిల్పా రెడ్డి ఉండటంతో మరింత స్పెషల్‌గా మారింది.. ఆమె నాకు ఆత్మబంధువు, సోదరి వంటిది అని సమంత చెప్పుకొచ్చింది.

Exit mobile version