Samantha Naga Chaitanya Divorce సమంత నాగ చైతన్య విడాకుల అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. బంగార్రాజు సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నాగ చైతన్య తన పర్సనల్ విషయాలను పంచుకున్నాడు. మీడియా అడిగిన ప్రశ్నకు తప్పించుకోకుండా సమాధానం చెప్పాడు. అలా మొదటిసారిగా ఇలా తన విడాకుల అంశం మీద, వాటి కారణాల మీద స్పందించినట్టు అయింది.
విడాకులు తీసుకుంటామని ఉమ్మడి ప్రకటన చేసిన తరువాత నాగ చైతన్య సైలెంట్‌గా ఉండిపోయాడు. కానీ సమంత మాత్రం ఓ రెండు మూడు సార్లు విడాకుల అంశం మీద స్పందించింది. తన అభిప్రాయాన్ని చెప్పింది. తన మీద వచ్చిన ఆరోపణలు, ట్రోలింగ్‌ను ఖండించింది. విడాకులు అయిన తరువాత తాను చచ్చిపోతానేమోనని అనుకున్నానని, కానీ తాను ఇంత ధైర్యం నిలబడగలను అని తనకు తెలిసి వచ్చిందని సమంత చెప్పుకొచ్చింది.
అయితే నాగ చైతన్య మాత్రం ఇంత వరకు విడాకుల అంశం మీద నోరు విప్పలేదు. దాని వెనుకున్న కారణాలను వెళ్లడించలేదు. తాజాగా నాగ చైతన్య చేసిన కామెంట్లు సోషల్ మీడియాను ఊపేస్తోన్నాయి. విడాకుల నిర్ణయంతో ఇద్దరం హ్యాపీగా ఉన్నాం. తను హ్యాపీ నేను హ్యాపీ. ఇద్దరికీ మంచిదనే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆ పరిస్థితుల్లో అదే మంచి నిర్ణయం. ఫ్యామిలీ అంతా కూడా సపోర్ట్ చేసిందని నాగ చైతన్య అన్నాడు.
అయితే ఆ పరిస్థితులు ఏంటి? విడాకులే మంచి నిర్ణయం? అని అనుకునే వరకు వ్యవహారం ఎందుకు వచ్చింది? అనే విషయాలను మాత్రం బయటపెట్టలేదు. అవి ఎప్పటికీ బయటకు రావు కూడా. అయితే తాజాగా సమంత ఓ పోస్ట్ చేసింది. తన ఇన్ స్టా స్టోరీలో ఓ వీడియోను షేర్ చేసింది. అందులోని నీతిని గమనిస్తే.. నాగ చైతన్య కామెంట్లు, విడాకుల వ్యవహారం మీద పరోక్షంగా స్పందించినట్టు కనిపిస్తోంది.
ఇంతకీ ఆ వీడియోలో ఏముంందంటే.. ఓ ప్రొఫెసర్ తన చేతిలో నీటితో నిండిన గ్లాసును పట్టుకుంటాడు. ఇందులో ఎంత వాటర్ ఉందని అడుగుతాడు. తలా ఒక నంబర్ చెబుతాడు. అసలు విషయం ఏంటంటే.. ఇందులో ఎంత నీరుందనేది కాదు. ఈ గ్లాసుని మనం కొంచెం సేపు పట్టుకుంటే ఏమీ అనిపించదు. అదే గంట సేపు అలానే పట్టుకుంటే నొప్పి వస్తుంది. అదే రోజంతా పట్టుకుంటే చేయి వాచిపోతుంది.
అంటే ఇది మనకున్న సమస్యలు, ఒత్తిడి, బాధ లాంటిది. అది ఎంత పెద్దది అని కాదు.. దాన్ని మనం ఎంత మోస్తున్నామనేది సమస్య అవుతుంది. ఆ గ్లాసుని పక్కన పెట్టేస్తే నొప్పి తగ్గుతుంది. అలానే ఆ సమస్యలు, ఒత్తిడి, బాధలను కూడా పక్కన పెట్టేస్తే మనకు ప్రశాంతంత ఉంటుంది అని ఓ నీతి పాఠాన్ని చెప్పాడు. అంటే సమంత కూడా తన పర్సనల్ లైఫ్‌లో జరిగిన వాటిని పక్కన పెట్టేసి ఇలా విడాకులు తీసుకుని హ్యాపీగా ఉంటోందన్న మాట.
మరి సమంత ఏ ఉద్దేశ్యంతో ఆ నీతి పాఠాన్ని షేర్ చేసిందో గానీ.. ఆమె ప్రస్తుత పరిస్థితికి మాత్రం ఈ పాఠం చక్కగా సరిపోయేట్టు కనిపిస్తోంది. అందుకే సమంత ఇప్పుడు అన్ని బాధలను మరిచిపోయి హ్యాపీగా తన సినీ కెరీర్ మీద ఫోకస్ పెట్టేసింది.