Site icon A2Z ADDA

‘పోలీస్ స్టోరీ’ వెనకాల ఇంత స్టోరీ ఉందా?.. చిరంజీవి అరిచేశాడన్న సాయి కుమార్

Sai Kumar-Police Story సాయి కుమార్ కెరీర్‌ను పీక్స్‌కు తీసుకెళ్లిన సినిమా పోలీస్ స్టోరీ. అప్పట్లో అదొక సంచనలం. అయితే ఈ సినిమా వెనకాల పెద్ద స్టోరీనే ఉంది. థ్రిల్లర్ మంజు చెప్పిన కథను అందరూ బాగుందని అన్నారట. కానీ చేసేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. అప్పుడు సాయి కుమార్‌తో ఈ సినిమాను కన్నడలో తీశాడు. ఆ సమయంలో టాలీవుడ్‌లో సాయి కుమార్ గ్రాఫ్ కాస్త కిందకే ఉండేది.

1996 సమయంలో కన్నడ నాట విడుదలైన పోలీస్ స్టోరీ సంచలనాలు క్రియేట్ చేసింది. సౌత్ మొత్తం కూడా సాయి కుమార్ పేరు మార్మోగిపోయింది. అగ్ని పాత్ర తీర్చిన విధానం, సాయి కుమార్ నటనకు అంతా ఫిదా అయ్యారు. అయితే అంతా బాగానే ఉంది. కానీ ఆ సినిమాను తెలుగులో ఎలా ప్రమోట్ చేయాలి? ఎలా విడుదల చేయాలనే ఆలోచనలో పడ్డారట.

ఇక తెలుగులో ఈ సినిమాను గాజుల నాగేశ్వర రావు రిలీజ్ చేయాలని అనుకున్నారట. అయితే ఇండస్ట్రీలోని పెద్ద హీరోతో ఈ సినిమా గురించి చెప్పించాలని అన్నారట. మెగాస్టార్ చిరంజీవితో చెప్పిస్తే బాగుందని గాజుల నాగేశ్వరరావు అన్నారట. దీంతో సాయి కుమార్ కాస్త ఆలోచనలో పడ్డాడట. అన్నయ్యను అడిగితే చెబుతాడు కానీ మొహమాటం అడ్డొస్తుందని అన్నాడట.

అయితే ఆ సినిమాను అంతకు ముందు నాగబాబు బెంగళూరులో చూసేశాడట. ఓ సారి చిరంజీవి అపాయింట్మెంట్ తీసుకుని సాయి కుమార్, గాజుల సాయి కుమార్ వెళ్లారట. గాజుల బయట వెయిట్ చేస్తున్నాడట. చిరంజీవి వీడియో బైట్ ఇస్తే సినిమా హిట్ అనుకుంటూ ఉన్నాడట. లోపల ఏమో సాయి కుమార్ మాట్లాడుతున్నాడట.

కన్నడలో బ్లాక్ బస్టర్ అయిందట కదా? ఆల్ ది బెస్ట్ అని సాయి కుమార్‌ను ప్రశంసించారట. నాగబాబు కూడా చూశాడట.. బాగుందని అన్నాడంటూ చిరు మెచ్చుకున్నాడట. అయితే తెలుగులో సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నాం.. నీ వీడియో బైట్ కావాలన్నయ్యా అని సాయి కుమార్ అన్నాడట.

నేను చెబితే అందరూ వింటారు.. మళ్లీ ఏదైనా తేడా కొడితే బాగుండదు.. పవన్ కళ్యాణ్ అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాకు కూడా చెప్పమంటే చెప్పలేదురా? అని చిరు తిరస్కరించాడట. అయితే సినిమా చూడండి.. నచ్చకపోతే చెప్పకండి అని అన్నాడట. దీంతో చిరంజీవి కూడా సరేనన్నాడట.

చిరంజీవి, మిగతా పెద్దలకు చూపించేందుకు ఒక ప్రింట్‌ను సాయి కుమార్ తీసుకొచ్చాడట. ఆ సమయంలో చిరంజీవి హిట్లర్ సినిమా షూటింగ్‌లో ఉన్నారట. రామా నాయుడు స్టూడియోలో కొంత మంది షో వేసి చూపిద్దామని టైం ఫిక్స్ చేసుకున్నాడట సాయి కుమార్. కానీ అదే సమయానికి చిరంజీవి కూడా చూస్తాను అని అన్నాడట.

కానీ ఇదేమో రామానాయుడు.. అదేమో అన్నపూర్ణ. ఎలా అని సాయి కుమార్ కాస్త టైం అడ్జస్ట్ చేసి రామానాయుడులో ఆరు గంటలకు షో వేసి.. చిరంజీవికి ఏడు గంటలకు షో వేశాడట. ఇక ప్రింట్‌లను అక్కడికి ఇక్కడికి బైక్ మీద ట్రాన్సఫర్ చేసుకుంటూ ఉన్నాడట. చిరంజీవి, సురేఖ ఇద్దరూ కూడా ముందు సీట్లో కూర్చుని రిలాక్స్ అవుతూ చూశారట. సినిమా ప్రారంభమైన తరువాత ఎంతో సీరియస్‌గా లీనమయ్యారట.

మధ్యలో ఓ సారి ప్రింట్ ఆగిపోవడంతో.. ఒక్కసారిగా చిరంజీవి అరిచేశారట. ఎవర్రా ఆపింది.. ఇలాంటి టైంలో ఆపుతార.. త్వరగా వేయండి అని ఆగ్రహం వ్యక్తం చేశాడట. సినిమా మొత్తం పూర్తయ్యాక.. సాయి కుమార్‌ను గట్టిగా మెడను పట్టేసుకున్నాడట చిరు. అదిరిపోయింది.. వెంటనే రా.. వీడియో ఇస్తాను అని చిరు అన్నారట. అలా చిరు చెప్పినట్టుగానే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

Exit mobile version