Anubhavinchu Raja Twitter Review సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు అనే సినిమాతో రాజ్ తరుణ్ హీరోగా దర్శకుడు శ్రీను గవిరెడ్డి ఒకసారి ప్రయత్నం చేశారు. కాని అది పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే మళ్లీ ఇప్పుడు అనుభవించు రాజా అంటూ రాజ్ తరుణ్ వచ్చాడు. భీమవరం నేపథ్యంలో తెరకెక్కించామంటూ.. రెండున్నర గంటల పాటు హాయిగా నవ్వుకునేలా సినిమా ఉంటుందని మొదటి నుంచి దర్శక నిర్మాతలు చెబుతూనే ఉన్నారు.
నిన్న సాయంత్రమే భీమవరంలో ప్రీమియర్ వేశామని చిత్రయూనిట్ తెలిపింది. కానీ ఎక్కడా కూడా సినిమాకు సంబంధించిన అప్డేట్లు, టాక్ మాత్రం కనిపించడం లేదు. మరి రాజ్ తరుణ్ అనుభవించు రాజాగా ప్రభావం చూపలేదు.. ఎక్కడా ప్రీమియర్స్‌ను కూడా ఎవ్వరూ పట్టించుకోవడం లేదా? అన్నది తెలియడం లేదు. చూస్తుంటే అనుభవించు రాజాను ఎవ్వరూ లెక్కలోకి తీసుకున్నట్టు కనిపించడం లేదు.
ఇలా అయితే ఈ సారి కూడా రాజ్ తరుణ్‌కు ఎదురుదెబ్బ తగిలినట్టేనా? అన్నది చూడాలి. అయితే సినిమా మీద టాక్, ఎలా ఉందన్నది తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే. అప్పుడే రాజ్ తరుణ్ భవిష్యత్ ఏంటన్నది తెలుస్తుంది. అనుభవించు రాజా నిజంగానే ప్రేక్షకులను ఫీల్‌ను అనుభవించేలా చేశాడా? లేదా అన్నది తెలుస్తుంది.