Site icon A2Z ADDA

Good Luck Sakhi Twitter Review : గుడ్ లక్ సఖి ట్విట్టర్ రివ్యూ.. అదరగొట్టేసిన కీర్తి సురేష్

Keerthy Suresh Good Luck Sakhi Twitter Review మహానటి సినిమాతో అదరగొట్టేసిన కీర్తి సురేష్ మళ్లీ ఇంత వరకు ఆ రేంజ్ సక్సెస్‌ను అందుకోలేకపోయింది. ఇప్పుడు కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో గుడ్ లక్ సఖి అనే చిత్రం వచ్చింది. క్రీడా నేపథ్యంలో రాబోతోన్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ షూటర్‌గా కనిపించనుంది. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రలు పోషించారు. సహ నిర్మాతగా శ్రావ్య వర్మ నేతృత్వంలో ఎక్కువ మంది మ‌హిళా స‌భ్యుల బృందంతో ఈ చిత్రం రూపొందడం విశేషం.

నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్న `గుడ్ లక్ సఖి` సినిమాని తెలుగు, తమిళ మరియు మలయాళ భాషలలో ఏకకాలంలో రూపొందించారు.
ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో ‘వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్’ బ్యానర్ పై సుధీర్ చంద్ర ప‌దిరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇలాంటి ఈ సినిమా నేడు (జనవరి 28) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉంది? నెటిజన్లు ఏమంటున్నారో ఓ సారి చూద్దాం.

కీర్తి సురేష్ నటన బాగుంది.. కానీ సినిమా మాత్రం ఫ్లాప్ అయ్యేలా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. పాప ఖాతాలో మరో ఫ్లాప్ అని ఎగతాళి చేస్తున్నారు. గుడ్ లక్ సఖి కాదు బ్యాడ్ లక్ కీర్తి అని పెట్టేస్తున్నారు. మొత్తానికి గుడ్ లక్ సఖి మీద మాత్రం ఇలా ప్రారంభంలోనే మిక్స్డ్ టాక్ వచ్చేసింది.

సోలో రిలీజ్ కావడంతో సినిమా టాక్ ఎలా ఉన్నా కూడా కలెక్షన్లు మాత్రం వచ్చేలా ఉన్నాయి. లిమిటెడ్ బడ్జెట్ మూవీ కావడంతో గుడ్ లక్ సఖి బాక్సాఫీస్ వద్ద గురి చూసి కొట్టేలా ఉందని తెలుస్తోంది. మొత్తానికి సినిమా మీద పూర్తి రివ్యూ కావాలంటే ఇంకొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.

Exit mobile version