Site icon A2Z ADDA

Ramarao On Duty Review : రామారావు ఆన్ డ్యూటీ రివ్యూ.. క్రేజ్ మొత్తం ఆ జోడిదే

Ramarao On Duty Review రవితేజ, రజిష విజయన్, దివ్యాన్ష కౌశిక్‌ల కాంబోలో రామారావు ఆన్ డ్యూటీ అనే చిత్రం వచ్చింది. శరత్ మండవ తెరకెక్కించిన ఈ చిత్రం నేడు (జూలై 29) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో ఓ సారి చూద్దాం.

కథ
ఈ కథ అంతా 90వ దశకంలో జరిగినట్టు చూపిస్తారు. కానీ తెరపై మాత్రం ఏ కోశాన కూడా అలా అనిపించదు. ఎస్టీడీ బూత్‌లో మాట్లాడే సమయంలోనే అలా అనిపిస్తుంది. ఇక ఇందులో రామారావు డిప్యూటీ కలెక్టర్ నుంచి ఎమ్మార్మోగా తన సొంతూరికే బదిలీ అవుతాడు. ఇక అక్కడ జరిగిన మిస్సింగ్ కేసులను ఎలా చేదిస్తాడు? ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠాను ఎలా మట్టు బెడతాడు? అనేది కథ. ఇక ఇందులో మాలిని (రజిష విజయన్), అనంత్ (రాహుల్ రామకృష్ణ), ఎస్పీ దేవానంద్ (జాన్ విజయ్), సీఐ మురళీ (వేణు తొట్టెంపూడి) ఇంపార్టెన్స్ ఏంటి? చివరకు రామారావు చేసిన డ్యూటీ ఏంటి అనేది కథ.

ఎంచుకున్న జానర్ ఏంటి?.. తెరకెక్కించిన విధానం ఏంటి? బ్యాక్ డ్రాప్ ఏంటి? 90వ దశకం నాటి పరిస్థితులు ఏంటి? అనేది ప్రేక్షకుడికి అంతగా ఎక్కదు. దర్శకుడు రాసుకున్న కథ, కథనం కూడా కొత్తగా ఏమీ అనిపించదు. ఇక పుష్ప సినిమాలా ఈ చిత్రాన్ని కూడా రెండు పార్టులుగా తెరకెక్కించాలనే తాపత్రయం చివర్లో కనిపిస్తుంది. స్మగ్లింగ్ నేపథ్యం, ఎర్ర చందనం లాంటి కాన్సెప్ట్ అంటే ఇప్పుడు అందరూ పుష్పతోనే పోల్చుతారు.

ఇక రామారావు మాత్రం అంత ఎఫెక్ట్ చూపించడు. రామారావు తన పరిధులు చెబుతూ సెక్షన్లు చెప్పడం, సబ్ కలెక్టర్, ఎమ్మార్వో విధులు, బాధ్యతలు చెప్పడం చూస్తే ప్రేక్షకులు ఆలోచనలో పడాల్సిందే. ఇన్ని అధికారులున్నాయా? అని నోరెళ్లబెట్టాల్సిందే. హీరో పాత్ర కాబట్టి, అతను ఆ పాత్రను పోషిస్తున్నాడు కాబట్టి.. లాజిక్కులు వెతక్కుండా చూడాల్సిందే అన్నట్టుగా అనిపిస్తుంది.

కొత్త కథ, పాయింట్ అని చెప్పారు కానీ రొటీన్ స్క్రీన్ ప్లేలో తెరకెక్కించినట్టు అనిపిస్తుంది. ఎలివేషన్ల కోసం సీన్లు, మధ్యలో పాటలు, రొమాన్స్ ఇవన్నీ కూడా ఫ్లోని మిస్ చేసినట్టు అనిపిస్తుంది. సంగీతం పర్వాలేదనిపిస్తుంది. కెమెరాపనితనం ఓకే అనిపిస్తుంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు మెప్పిస్తాయి.

రవితేజ తన పాత్రలో జీవించేశాడు. మాస్ హీరోగా తన అభిమానులను మరోసారి ఆకట్టుకుంటాడు. కొత్త పాత్రే అయినా పాత పద్దతిలోనే నటించేసినట్టు అనిపిస్తుంది. వేణు పాత్ర అంతగా మెప్పించకపోవచ్చు. హీరోయిన్లది తేలిపోయే పాత్రలే. ఇక పవిత్ర, నరేష్‌లకు స్క్రీన్ మీద పర్ఫామెన్స్ చేసే చాన్స్ రాకపోయినా.. జనాలు మాత్రం వారిని చూసి తెగ గోల చేసేస్తున్నారు. రవితేజకు పడాల్సిన ఈలలు, గోలలు ఆ జోడికి పడుతుంటాయి. మిగిలిన పాత్రల్లో రాహుల్ రామకృష్ణ, నాజర్ ఇలా అందరూ మెప్పిస్తారు.

రేటింగ్ 2.5

బాటమ్ లైన్.. సగం డ్యూటీ పూర్తి చేసిన రామారావు

Exit mobile version