Site icon A2Z ADDA

Ram Nithin Mad ‘మ్యాడ్’ నుంచి ‘నువ్వు నవ్వుకుంటూ’ సాంగ్

Ram Nithin Mad: ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తమ క్రేజీ అండ్ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’తో అలరించడానికి 2023, అక్టోబర్ 6న వస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ లో వేగం పెంచింది. ఈరోజు(సెప్టెంబరు 26న) చిత్ర బృందం ‘నువ్వు నవ్వుకుంటూ’ అంటూ సాగే అందమైన మెలోడీ పాటను విడుదల చేసింది. ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చగా, కపిల్ కపిలన్ ఆలపించారు. పాట సందర్భానికి తగ్గట్టుగా గీత రచయిత భాస్కరబట్ల యూత్‌ఫుల్ మరియు రొమాంటిక్ లిరిక్స్ రాశారు.

రామ్ నితిన్, సంగీత్ శోభన్, నార్నే నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌ కుమార్, గోపికా ఉద్యన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. మ్యాడ్ సినిమాతో హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయం అవుతున్నారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పై సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రంతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. షామ్‌దత్ సైనుద్దీన్, దినేష్ కృష్ణన్ బి ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు.

Exit mobile version