Site icon A2Z ADDA

రా రాజా రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

ఇంత వరకు మొహాలు లేకుండా, ఆర్టిస్టుల్ని చూపించకుండా సినిమాను ఎవ్వరూ తీయలేదు. అలాంటి ఓ ప్రయోగాన్ని చేసింది రా రాజా టీం. శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో సుగి విజయ్, మౌనిక హెలెన్ ప్రధాన పాత్రల్లో నటించారు. మరి ఈ మూవీ ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

కథ
రాజా (సుజి విజయ్), రాణి (మౌనిక హెలెన్) ప్రేమ పెళ్లి చేసుకుంటారు. పెద్దలకు దూరంగా జీవితాన్ని గడుపుతుంటారు. వారి జీవితంలో అంతా బాగానే ఉంది అని అనుకునే టైంలో రాజా, రాణిలపై దాడి జరుగుతుంది. ఆ దాడికి కారణం ఏమిటి? రాజాకు ఎదురయ్యే భయానక పరిస్థితులు ఏంటి? చివరకు వాటి నుంచి ఎలా బయటపడ్డారు? అన్నదే కథ.

నటీనటుల
సుజి విజయ్, మౌనిక హెలెన్ పాత్రల మొహాలు అయితే కనిపించవు. కానీ ఆ పాత్రలు ప్రతీ ఒక్క ఎమోషన్‌ను పలకిస్తుంటాయి. లవ్, ఫ్రెండ్ షిప్, ఎమోషన్, యాక్షన్, కామెడీ, హారర్, క్రైమ్ ఇలా అన్ని రకాలను ఈ చిత్రంలో చూపించారు. చార్లీ బీన్ పాత్రలో నాగూర్ ఖాన్ స్నేహితురాలిగా కొన్ని నవ్వులు పూయిస్తుంది. CIగా మధుకర్ చివరికి మంచి ట్విస్ట్ కూడా వస్తుంది.

టెక్నికల్‌గా.. శ్రీ పద్మిని సినిమాస్ ఈ చిత్రాన్ని అద్భుతమైన నిర్మాణ విలువలతో రూపొందించడంలో తన ప్రతిభను నిరూపించుకుంది. దర్శకుడు, నిర్మాత బి. శివ ప్రసాద్ సాహసోపేతమైన ప్రయత్నం ప్రశంసనీయం అవుతుంది. పాత్రల ముఖాలను చూపించకుండా చిత్రాన్ని ప్రదర్శించడంలో ఆయన సామర్థ్యం అందరికీ అర్థం అవుతుంది. ఇలాంటి కాన్సెప్ట్‌తో ఇంత వరకు ఎవ్వరూ సినిమాను తీయలేకపోయారు. డిఓపి రాహుల్ శ్రీవాస్తవ్ కెమెరా పనితనం చాలా ఆకట్టుకుంటుంది. ఉప్పు మారుతి ఎడిటింగ్ బాగుంది. శేఖర్ చంద్ర సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం అని చెప్పొచ్చు.

విశ్లేషణ

రా రాజా సినిమాను థియేటర్లలో దాని విజువల్స్, బీజీఎం ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటాయి. చిత్రంలోని ప్రతి సన్నివేశాన్ని మీ ప్రస్తుత జీవితంలో అనుభవించినట్టుగా ఫీల్ అవుతారు. సినిమాలో ముఖాలను చూపించకుండా చిత్రాన్ని ప్రదర్శించడానికి చిత్రనిర్మాతలు చేసిన గొప్ప ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ సినిమా భిన్నమైన అనుభూతిని ఇస్తుంది. భయానక విజువల్స్, వెంటాడే నేపథ్య సంగీతం సినిమాను నిలబెడతాయి.

రేటింగ్: 3/5

Exit mobile version