Site icon A2Z ADDA

Bigg Boss 5 Telugu: పిచ్చెక్కించిన ప్రియ.. కంట్రోల్ తప్పిన సన్నీ

Priya and Sunny Gets Angry In Bigg Boss 5 Telugu

Bigg Boss 5 Telugu బిగ్ బాస్ ఇంట్లో ప్రియ, సన్నీది రేర్ కాంబినేషన్. ఈ ఇద్దరికి ఎక్కడ గొడవ మొదలైందో కరెక్ట్ చెప్పడం కష్టమే. బయటే ఈ ఇద్దరూ శత్రువులా? లేదంటే ఇంట్లోకి వచ్చాకే ఇలా తయారయ్యారా? అన్నది తెలియదు. ఒకరినొకరు నామినేట్ చేసుకుంటూనే వస్తారు. కనెక్షన్ కుదరడం లేదు.. తాను మాట్లాడేందుకు ప్రయత్నించినా కూడా మొహం తిప్పుకుంటాడని సన్నీ గురించి చెబుతూ ప్రతీసారి ప్రియ నామినేట్ చేస్తూనే ఉంటుంది. ఇక సన్నీ సైతం ప్రియనే నామినేట్ చేస్తుంటాడు.

ఇదంతా కాసేపు పక్కన పెడితే.. నిన్నటి టాస్కులో మాత్రం ప్రియ పిచ్చెక్కించింది. సన్నీ కూడా తన కోపాన్ని చాలా మట్టుకు కంట్రోల్ చేసుకున్నాడు. కానీ మాటలు, చేతలు మాత్రం కాస్త హద్దులు దాటేశాయి. బంగారు కోడి పెట్ట టాస్కులో ప్రియ ఆడే ఆట అందరికీ అర్థమైంది. ప్రభావతి దగ్గర గుడ్లు పట్టుకోకుండా.. కంటెస్టెంట్లు దాచి పెట్టుకున్న గుడ్లను టార్గెట్ చేసింది. అందులోనూ మరీ ముఖ్యంగా సన్నీ, కాజల్ దాచుకున్న గుడ్లను దొంగతనం చేయడం ప్రారంభించింది.

అలా సన్నీ దాచుకున్న గుడ్లను దొంగతనం చేస్తున్న ప్రియను, సన్నీ అడ్డుకున్నాడు. ఆ క్రమంలో సన్నీ ప్రియను తోసేశాడు. దాంతో ప్రియ కాస్త ఫైర్ అయింది. తనను తాకితే చెంప పగలగొడతాను అని పదే పదే అనేసింది. దీంతో సన్నీ మీద మీదకు వెళ్లేశాడు. కొన్ని మొహాలకు ఆడటం కూడా రాదు అని దారుణంగా అనేశాడు. ఈడు చెప్పాలా ఎలా ఆడాలో అని ప్రియ అనేసింది. ఆడు ఈడు అని అనొద్దంటూ ప్రియకు వార్నింగ్ ఇచ్చాడు. నేను అనలేదు.. అవసరం అయితే అంటాను అని ప్రియ కూడా కౌంటర్ వేసింది. మొత్తానికి ఈ ఇద్దరి వ్యవహారం మాత్రం శ్రుతిమించింది.

Exit mobile version