Site icon A2Z ADDA

ఈ రేంజ్‌కి అమ్ముకోవడమా.. ఛీ.. ఛీ.. పవన్‌పై ప్రకాష్ రాజ్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద నటుడు ప్రకాష్ రాజ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇంటి వరకు మాతృ భాష ఉపయోగపడుతుందని, ఇల్లు దాటితే మాత్రం జాతీయ భాష హిందీ అవసరం ఉంటుంది అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల మీద ప్రకాష్ రాజ్ ట్వీట్ వేశారు. ఈ స్థాయిలో అమ్ముకోవడమా? ఛీ.. ఛీ.. అంటూ మండి పడ్డారు.

ఇదే పవన్ కళ్యాణ్ గతంలో హిందీ గో బ్యాక్ అన్నారని, ఇప్పుడు ఇలా అంటున్నారని కొంత మంది నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. మరి కొంత మంది అయితే ప్రకాష్ రాజ్‌ను తిడుతున్నారు. నీకు పర భాషల మీద ఎందుకంత ద్వేషం.. అలాంటప్పుడు నువ్వు అన్ని భాషల్లో ఎందుకు నటించావ్?.. అంటూ విమర్శలు చేస్తున్నారు. నువ్వెప్పుడూ పవన్ కళ్యాణ్ పడి ఏడ్వడమేనా? అంటూ ఫ్యాన్స్ తిడుతున్నారు.

Exit mobile version