Site icon A2Z ADDA

ఘనంగా ‘రాయుడు గారి తాలూకా’ విజయోత్సవం

వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన ‘రాయుడు గారి తాలూకా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. మార్చి 6వ తేదీన విడుదలైన ఈ సినిమా, విడుదలైన ప్రతి చోటా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ పాజిటివ్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించి తమ ఆనందాన్ని పంచుకుంది. ఈ చిత్రానికి ఉలిశెట్టి శ్రీనివాస్ హీరోగా నటించడమే కాకుండా, స్వయంగా కథ, కథనంను అందించి తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు. ఒక బలమైన కథాంశాన్ని అంతే బలంగా తెరపైకి తీసుకురావడంలో ఆయన సఫలీకృతమయ్యారని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు.

సినిమాకు వస్తున్న ఆదరణ చూసి చిత్ర బృందం ఎంతో ఉత్సాహంగా ఉంది. సక్సెస్ మీట్‌లో పాల్గొన్న టీం సభ్యులు మాట్లాడుతూ.. “మంచి కంటెంట్ ఉన్న సినిమాను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని ఈ చిత్రం నిరూపించింది. మార్చి 6 నుంచి అన్ని సెంటర్లలో వస్తున్న పాజిటివ్ టాక్ మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది” అని తెలిపారు.

Exit mobile version