OG Twitter Review పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ కోసం ఆడియెన్స్, అభిమానులు ఎంతగా ఎదురు చూశారో అందరికీ తెలిసిందే. పెయిడ్ ప్రీమియర్ల నుంచి టాక్ బయటకు వచ్చింది. ట్విట్టర్‌లో ఆల్రెడీ ఓజీ టాక్ స్ప్రెడ్ అయిపోయింది. ఇక పెయిడ్ ప్రీమియర్లు తరువాత రివ్యూలు కూడా హల్చల్ చేస్తున్నాయి. ఓజీ మూవీపై పెట్టుకున్న అంచనాలకు మాత్రం సినిమా రీచ్ అవ్వలేదనే టాక్ ఇప్పుడు నెట్టింట్లో ఎక్కువగా వినిపిస్తోంది. మరి ఈ చిత్రంపై నెటిజన్లు ఏం మాట్లాడుకుంటున్నారో ఓ సారి చూద్దాం.
ఫస్ట్ హాఫ్‌లో సినిమాకు సంబంధించిన కథ ఏమీ లేదని అంటున్నారు. ఇంట్రో, ఇంట్రవెల్ మాత్రమే బాగుందని చెబుతున్నారు. ఫస్ట్ హాఫ్‌లో కారెక్టర్ల ఇంట్రొడక్షన్ మాత్రమే ఉందని, అసలు కథ అయితే స్టార్ట్ కాలేదట. ఇక పవన్ కళ్యాణ్‌ను మాత్రం సుజీత్ అద్భుతంగా చూపించాడని అంటున్నారు. ఈ చిత్రానికి మాత్రం తమన్ అసలైన హీరో అని చెబుతున్నారు. అలా మొత్తంగా ఫస్ట్ హాఫ్ ఓకే ఓకే అన్నట్టుగా సాగిందట.
కీలకంగా మారాల్సిన సెకండాఫ్ కూడా చేతులు ఎత్తేసినట్టుగానే ఉందట. ఎమోషన్స్ కంటే ఎలివేషన్స్ మీదే సుజీత్ ఫోకస్ చేశాడట. కథలో సరైన ఎమోషన్ కనిపించలేదట. పైగా సబ్ ప్లాట్స్ ఎక్కువగా పెట్టి చాలా కన్ఫ్యూజ్ చేశాడట. కథ మాత్రం ఎటెటో తీసుకెళ్లినట్టుగా కనిపిస్తుందట. కేవలం ఎలివేషన్స్‌తో అయితే సినిమాను నెట్టుకు రాలేము కదా అని జనాలు మాట్లాడుకుంటున్నారు.
ఎలివేషన్స్, బిల్డప్స్ బాగానే ఇస్తారట. కానీ అందుకు తగ్గట్టుగా కథలో ఎలాంటి సీన్లు పడవట. ఆ మాత్రం దానికి ఎలివేషన్స్ ఎందుకు అన్నట్టుగా ఉంటుందట. తమన్ మాత్రం తన డ్యూటీని వందకు వెయ్యి శాతం చేశాడని చెబుతున్నారు. ఇది కేవలం ఫ్యాన్స్‌కి మాత్రమే పూనకాలు తెప్పిస్తుందట. పవన్ కళ్యాణ్‌ను రీసెంట్ టైంలో ఇంత బాగా చూపించిన క్రెడిట్ మాత్రం సుజిత్‌కి దక్కుతుందట.