Site icon A2Z ADDA

Bheemla Nayak లెక్కలివే.. ఎంత రాబట్టాలంటే?

Bheemla Nayak Budget పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా మీదున్న హైప్‌కి నిదర్శనంగా బుకింగ్‌లను చూపించొచ్చు. ప్రపంచ వ్యాప్తంగా భీమ్లా నాయక్ బుకింగ్స్ ఫుల్ స్వింగులో ఉన్నాయి. అన్నీ థియేటర్లలో టికెల్ సేల్ అయపోయాయి. మొదటి రోజే రికార్డ్ కలెక్షన్లను కొల్లగొట్టేందుకు రెడీ అవుతోంది.

ఇప్పటికే భీమ్లా నాయక్ దెబ్బకు బుక్ మై షో పరుగులు పెడుతోంది. దాదాపు మొదటి రోజు అన్ని షోలు ఫుల్ అయిపోయాయి. ఇప్పుడు టికెట్లు దొరకడం చాలా కష్టంగా మారిపోయింది. అయితే భీమ్లా నాయక్ లెక్కలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. భీమ్లా నాయక్ బడ్జెట్ ఎంత? ఎంతకు అమ్ముడు పోయింది.. ఎంత కలెక్ట్ చేయాలి? అనే విషయాల మీద అందరూ ఫోకస్ పెడుతున్నారు.

దాదాపు 75 కోట్లతో భీమ్లా నాయక్ సినిమాను తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను వంద కోట్లకు పైగా అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. నైజాంలో ఈ సినిమాను 35 కోట్లు, సీడెడ్‌లో 16.5కోట్లు, ఉత్తరాంధ్రలో 9, ఈస్ట్ 6.4, వెస్ట్ 5.4, గుంటూరు 7.2, నెల్లూరు 3.25 ఇలా మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 88.75 కోట్లకు అమ్ముడు పోయినట్టు తెలుస్తోంది.

ఇక కర్ణాటక రెస్టాఫ్ ఇండియాలో అయితే 9 కోట్లు, ఓవర్సీస్‌లో 9 కోట్లు కలుపుకుంటే.. మొత్తానికి ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 107 కోట్ల వరకు అమ్ముడుపోయింది. ఈ లెక్కన 108 కోట్ల కొల్లగొడితే ఈ చిత్రం హిట్ అయినట్టు లెక్క. మరి పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్‌గా ఎంత రాబడుతాడో చూడాలి.

Exit mobile version