Pawan Kalyan హైద్రాబాద్‌లో ప్రతీ ఏటా అలయ్ బలయ్ ప్రోగ్రాం జరుగుతుందన్న సంగతి తెలిసిందే. అంతా ఒక్కటే అందరం సమానమే అని తెలియజేసే ఈ కార్యక్రమంలో ఈ సారి కొన్ని వింత ఘటనలు జరిగాయి. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయిన భారతదేశం వివిధ సంస్కృతులు, సంప్రదాయాలు, అచార వ్యవహారాలకు ప్రతీకగా ఆత్మీయత, గౌరవం, ప్రేమాభిమానాల సంగమమే అంటూ జరిపే ఈ అలయ్ బలయ్ కార్యక్రమంలో మంచు విష్ణు, పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.
బిజేపీ తరుపున పవన్ కళ్యాణ్ వచ్చాడు.ఇక మా అధ్యక్షుడిగా గెలిచిన సందర్భంగా బీజేపీ పార్టీ అతడిని కూడా ఆహ్వానించినట్టుంది. అయితే ఈ కార్యక్రమంలో మాత్రం మంచు విష్ణును కనీసం కన్నెత్తి కూడా చూడలేదు పవన్ కళ్యాణ్. పక్క పక్కన కూర్చున్నా కూడా ఎడమొహం పెడమొహంగానే ఉన్నారు. పక్కపక్కన కూర్చీలు వేసినా కూడా.. చాలా గ్యాప్‌తోనే కూర్చున్నారు.
మంచు విష్ణు నమస్కారం పెట్టి పలకరించేందుకు ప్రయత్నించినా కూడా పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు. తన దారిన తాను వెళ్లాడు కుర్చీలో ఆసీనులయ్యాడు. మా ఎన్నికల ఎఫెక్ట్ అక్కడ బాగానే కనిపించింది. దీన్ని బట్టి మంచు మెగా ఫ్యామిలీ మధ్య ఎంత దూరం పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. కానీ మంచు మనోజ్ అయితే నేరుగా భీమ్లా నాయక్ సెట్‌లోకి వెళ్లి పవన్ కళ్యాణ్‌తో కాసేపు ముచ్చటించాడు. కానీ ఆ సమయంలోనూ పవన్ కళ్యాణ్ ముభావంగానే ఉన్నట్టు కనిపించింది. మొత్తానికి మెగా రాజీకోసం మంచు వారు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది.