Site icon A2Z ADDA

Paata Uttej: ఆ అనూభూతిని మాటల్లో వర్ణించలేను.. ఉత్తేజ్ కూతురు ఎమోషనల్

Paata Uttej టాలీవుడ్ నటుడు ఉత్తేజ్ కూతురు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. అమ్మ మరణం దగ్గరి నుంచి ప్రతీ ఒక్క పోస్ట్‌లో ఆమె బాధ కనిపిస్తోంది. ఉత్తేజ్ భార్య పద్మావతి గత రెండు నెలల క్రితం అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఉత్తేజ్ పెద్ద కూతురు చేతన గర్భవతి అన్న విషయం తెలిసిందే. గత నెలలో సీమంతం వేడుకలు కూడా ఘనంగా జరిగాయి.

ఇక తన అమ్మ మళ్లీ అక్క కడుపులో పుడుతుందని పాట ఉత్తేజ్ చెబుతుంటుంది. మళ్లీ మా కోసం రా అమ్మా ఎమోషనల్ పోస్ట్‌లు పెడుతూ ఉంటుంది. అయితే తాజాగా పాట ఉత్తేజ్ నెట్టింట్లో తన ఫాలోవర్లతో చిట్ చాట్ చేసింది. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ఇందులో భాగంగా పిన్నివి అవుతున్నావ్ కదా? ఎలాంటి ఫీలింగ్ ఉందని అడిగారు కొందరు.

దానికి పాట సమాధానం ఇచ్చింది. పిన్నిని అవుతున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది.. ఇంత చిన్న వయసులోనే పిన్నిని అవుతున్నందుకు ఏదోలా ఉంది.. నా ఫీలింగ్స్‌ను మాటల్లో వర్ణించలేను.. పిన్నిని కాబోతోన్నాను అనే ఆ అనుభూతిని చెప్పలేను.. మా అక్క ఇంత త్వరగా ఎదుగుతుందని, తల్లి అవుతుందని కూడా నేను ఊహించలేదు అని పాట ఎమోషనల్ అయింది.

ఇక నా డార్లింగ్ బుజ్జి పాప ఎప్పుడు వస్తుందా? అని నేను ఎంతగానో ఎదురుచూస్తున్నాను అంటూ చేతన, పాట ఉత్తేజ్ ఇద్దరూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక ఉత్తేజ్ ఇంట్లో సంతోషాలు వెల్లివిరిసేందుకు సమయం ఆసన్నమైంది.

Exit mobile version