Site icon A2Z ADDA

జూన్ 21న ‘ఓ మంచి ఘోస్ట్’

వెన్నెల కిషోర్, నందితా శ్వేత ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘ఓ మంచి ఘోస్ట్’. హారర్, కామెడీ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి ఆధరణ ఎప్పుడూ ఉంటుంది. థియేటర్లోనూ, ఓటీటీలోనూ ఈ జానర్‌ సినిమాలను ఆడియెన్స్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇక నవ్వించడంలో వెన్నెల కిషోర్, భయపెట్టడంలో నందితా శ్వేత ఎంతగా నటించేస్తుంటారో అందరికీ తెలిసిందే. ఈ సూపర్ కాంబినేషన్ లో మార్క్‌సెట్ నెట్‌వర్క్స్ బ్యానర్‌పై శంకర్ మార్తాండ్ దర్శకత్వంలో ‘ఓ మంచి ఘోస్ట్’ అనే చిత్రం జూన్ 21న రాబోతోంది.

ఈ చిత్రంలో షకలక శంకర్, నవమి గాయక్, నవీన్ నేని, రజత్ రాఘవ్, హాస్యనటుడు రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. డా.అబినికా ఇనాబతుని నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం నిర్మించగా.. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్, లిరికల్ సాంగ్‌, టీజర్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి బజ్ ఏర్పడిన ఈ చిత్రాన్ని జూన్ 21న విడుదల చేయనున్నారు.

ఎన్నో హిట్ చిత్రాలకు సంగీతాన్ని అందించిన అనూప్ రూబెన్స్ ‘ఓ మంచి ఘోస్ట్‌’కు మంచి ఆర్ఆర్, పాటలు ఇచ్చారు. ఈ చిత్రానికి అనూప్ మ్యూజిక్ ప్లస్ కానుంది. సినిమా అంతా కూడా నవ్విస్తూ, భయపెట్టిస్తూ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసేలా కనిపిస్తోంది. ఇక థియేటర్లో చాలా రోజుల తరువాత వెన్నెల కిషోర్ తన నటనతో అందరినీ నవ్వించేందుకు సిద్దంగా ఉన్నారు. ఇక షకలక శంకర్, రఘుబాబు వంటి ఆర్టిస్టులతో మంచి ఎంటర్టైన్‌మెంట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు.

Exit mobile version