Site icon A2Z ADDA

వార్ 2 ట్విట్టర్ రివ్యూ.. ఎంట్రీలు అదుర్స్

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన చిత్రం ‘వార్ 2’. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆదిత్య చోప్రా ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమా ఆగస్ట్ 14న థియేటర్లోకి వచ్చింది. ఇక ఎర్లీ షోలు, ఓవర్సీస్ నుంచి టాక్ బయటకు రావడంతో సోషల్ మీడియాలో వార్ 2 వైరల్ అవుతోంది. అసలు ఈ మూవీ ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

ఇద్దరి ఎంట్రీలు అదిరిపోతాయంట. అయితే స్టార్టింగ్ కొంత సేపు బాగానే అనిపించినా.. కూడా ఆ తరువాత రెగ్యులర్ స్పై మూవీస్‌లానే సాగుతుందట. ఎక్కడా కూడా కొత్తదనం కనిపించదట. ఇంటర్వెల్ సీన్ మళ్లీ కాస్త పట్టాలెక్కినట్టుగా ఉంటుందట. ఇక ఈ ఇద్దరూ వేసిన డ్యాన్స్ నంబర్ మాత్రం బాగానే వచ్చిందట.

ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఈ ఫస్ట్ హాఫ్‌ని చూసి తెగ సంబరపడిపోతోన్నారు. ఈ మాత్రం ఉంటే చాలు అని, ఫస్ట్ హాఫ్‌లో ఎన్టీఆర్ అదరగొట్టేశాడని అంటున్నారు. సెకండాఫ్ ఇందులో కాస్త మ్యాచ్ చేసినా చాలు అని, ఎన్టీఆర్ కుమ్మేశాడని సంబరపడిపోతోన్నారు. మరి సెకండాఫ్ కాస్త గట్టిగా నిలబడితే, ట్విస్టులు, టర్న్స్ ఉంటే వార్ 2కి తిరుగు ఉండకపోవచ్చు. ఎన్టీఆర్, హృతిక్ హవాలో కియారా అందాల గురించి ఎక్కువగా చర్చలు అయితే కనిపించడం లేదనిపిస్తోంది.

Exit mobile version