Site icon A2Z ADDA

Bhala Thandhanana Teaser : అదరగొట్టేసిన శ్రీవిష్ణు

Bhala Thandhanana Teaser విలక్షణ కథలతో తన మార్క్ చూపెడుతున్న యంగ్ హీరో శ్రీ విష్ణు ప్రస్తుతం ‘భళా తందనాన’ అనే కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీ చేస్తున్నారు. బాణం ఫేమ్ దంతులూరి చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కేథ‌రిన్ థ్రెసా హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ విడుదలకు సిద్దంగా ఉంది.

ఫస్ట్ లుక్ పోస్టర్, మ్యూజికల్ ప్రమోషన్స్‌తో సినిమా మీద పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. నేడు నాచురల్ స్టార్ నాని చేతుల మీదుగా ఈ మూవీ టీజర్ విడుదలైంది. ‘రాక్షసున్ని చంపడానికి దేవుడు కూడా అవతారాలెత్తాలి.. నేను మామూలు మనిషిని’ అంటూ శ్రీవిష్ణు చెప్పిన డైలాగ్‌తో టీజర్ ఓపెన్ అవుతుంది. ఇక శ్రీవిష్ణు సాఫ్ట్ రోల్‌లో కనిపించగా.. కేథరిన్ థ్రెస్సా మాత్రం పొగరుబోతుగా కనిపించారు.

నీ దారిలో నువ్వు.. నా దారిలో నేను.. ఇద్దరి లక్ష్యం ఒకటే అనే డైలాగ్‌తో హీరో హీరోయిన్ల ప్రయాణం, లక్ష్యం ఏంటో చెప్పేశారు. యాక్షన్ సీక్వెన్స్, శ్రీ విష్ణు నటన ప్రత్యేకంగా నిలిచేట్టుంది. ఇక రాజకీయ నాయకులను ప్రశ్నిస్తూ ముగిసిన టీజర్ అందరినీ మెప్పించేలా ఉంది. టీజర్‌లోని డైలాగ్స్ సినిమా కథ ఎలా ఉండోబోతోంద చెప్పేశాయి. డైలాగ్సే సినిమాకు మేజర్ హైలెట్ అయ్యేట్టున్నాయి. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమాను పక్కా కమర్షియల్‌గా తెరకెక్కించారు దర్శకులు చైతన్య దంతులూరి.

Bhala Thandhanana Teaser | Sree Vishnu | Catherine Tresa | Mani Sharma | Chaitanya Dantuluri

ఇక ఈ టీజర్ మొత్తంలో శ్రీవిష్ణు తన నటనతో అందరినీ మెప్పించేలా ఉన్నారు. నటనలోని వేరియేషన్స్ చక్కగా చూపించారు. కేథరిన్ ఈ రోల్‌కు పర్ఫెక్ట్ అనిపించేలా నటించారు. శ్రీనివాస్ రెడ్డి కామెడీ, కేజీయఫ్ ఫేమ్ రామచంద్ర రాజు విలనిజం అదిరిపోయింది. మెలోడీ బ్రహ్మ మణి శర్మ బాణీలు కడుతుండగా.. సురేష్ రగుతు కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. వారాహా చలనచిత్రం బ్యానర్ నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. టీజర్‌తో సినిమా మీద అంచనాలు పెంచేశారు.

పాపులర్ ప్రొడక్షన్ హౌస్ వారాహి చలనచిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా రచయితగా, మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్‌గా, గంధి నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్‌గా, పీటర్ హెయిన్ యాక్షన్ కొరియోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు.

Exit mobile version