Site icon A2Z ADDA

Bimbisara మూవీపై బాలయ్య.. నందమూరి వంశాన్ని ప్రస్థావించిన నటసింహం

నందమూరి వంశం గురించి గొప్పగా చెప్పడంలో బాలయ్య ఎక్కడా కూడా వెనక్కి తగ్గడు. తన తండ్రి స్వర్గీయ ఎన్టీ రామారావు గురించి చెప్పకుండా తన స్పీచులు అస్సలు ఉండవు. సమయం, సందర్భం అవసరం లేకుండా.. బాలయ్య తన తండ్రి గురించి చెబుతుంటాడు. అలా తాజాగా బింబిసార సినిమాను వీక్షించిన తరువాత బాలయ్య ఎమోషనల్ అయ్యాడు. కళ్యాణ్ రామ్ గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు.

బింబిసార సినిమా ఎంతో గొప్పగా ఉందని, ఇలాంటి కొత్త కథలు, కాన్సెప్ట్ సినిమాలు రావాలని కోరుకున్నాడు. ఇలాంటి కథలను నమ్మడంలో మేం ముందుంటాం.. మా నాన్నగారు స్వర్గీయ రామారావు గారు అప్పట్లోనే ఎన్నో ప్రయోగాలు చేశారు. కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చారు. కొత్త పాత అని కాకుండా.. టాలెంట్ ముఖ్యం.. ఇలాంటివి మేం మాత్రమే చేయగలమంటూ బాలయ్య పేర్కొన్నాడు.

ఇందులో మంచి సందేశం ఉందని, అందరూ చూడండని కోరాడు. కొత్త కథలను ఆదరిస్తారని, మళ్లీ తెలుగు ప్రేక్షకులు నిరూపించారు.. వారందరికీ థాంక్స్. ఈ సినిమాను అందరూ కచ్చితంగా చూడాలని బాలయ్య తెలిపాడు. మొత్తానికి బింబిసార విజయంతో నందమూరి అభిమానులు మాత్రం పండుగ చేసుకుంటున్నారు. బాలయ్య, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇలా వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టేయడంతో కాలర్ ఎగిరేస్తున్నారు.

Nandamuri Balakrishna, Bimbisara, Kalyan Ram, కళ్యాణ్ రామ్, నందమూరి బాలకృష్ణ, బింబిసార

Exit mobile version