Site icon A2Z ADDA

Akhanda Trailer : శాసనం.. దైవ శాసనం

Akhanda Trailer బాలయ్య బోయపాటి కాంబినేషన్‌లో రాబోతోన్న అఖండ సినిమా ట్రైలర్ కాసేపటి క్రితం విడుదలైంది. ఇందులో బాలయ్య దుమ్ములేపేశాడు. బోయపాటి డైలాగ్స్ బాలయ్య చెబితే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. తాజాగా వదిలిన ట్రైలర్‌లో డైలాగ్స్ వర్షం కురిసినట్టు అనిపించింది.

‘విధికి విధాతకు విశ్వానికి సవాళ్లు విసరకూడదు’.. అంటూ ట్రైలర్ మొదలవగా.. ‘అంచనా వేయడానికి పోలవరం డ్యామా? పట్టిసీమ తూమా? పిల్ల కాలువ’, ‘ఒక మాట నువ్వంటే శబ్దం.. అదే నేను అంటే శాసనం.. దైవ శాసనం’, ‘మీకు సమస్య వస్తే దండం పెడతారు.. నేను పిండం పెడతాను’, ‘అఖండ.. నేనే నేనే’ అంటూ బాలకృష్ణ చెప్పిన డైలాగ్స్ అద్బుతంగా ఉన్నాయి.

‘ఒకసారి బరిలోకి దిగితే బ్రేకుల్లేని బుల్డోజర్‌ని తొక్కి పారదొబ్బుత.. లైఫ్టా? రైటా? టాపా? బాటమా? ఎటు వైపు నుంచి గీకినా.. కొడకా.. ఇంచు బాడీ కూడా దొరకదు అని బాలయ్య దుమ్ములేపేశాడు. ‘నాకు బురద అంటింది.. నాకు దురద వచ్చింది.. నాకు బ్లడ్ వచ్చింది.. గడ్డ వచ్చింది అని అడ్డమైన సాకులు చెబితూ పని ఆపితే. ’ అంటూ శ్రీకాంత్ భయపెట్టేశాడు.

Exit mobile version