Site icon A2Z ADDA

Bigg Boss 5 Telugu : పస లేని హోస్టింగ్.. నాగ్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారా?

బిగ్ బాస్ ఇంట్లో హోస్ట్ నాగార్జున ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి హోస్ట్ షో మొత్తాన్ని చూసి వస్తే ఇంకా బాగుంటుంది. కానీ బిగ్ బాస్ టీం ఇచ్చే స్క్రిప్ట్, వారి డైరెక్షన్‌లో యాక్షన్ కట్ చెబితే ఇలానే ఉంటుంది. నిన్నటి ఎపిసోడ్‌లో నాగ్ ఎంతో సీరియస్‌గా ఉండాల్సింది. కానీ నవ్వుతూనే వార్నింగ్‌లు ఇచ్చాడు. అవి అసలు వార్నింగ్‌ల్లానే లేవు. యాంకర్ రవి గట్టిగా ఇవ్వాల్సిన వార్నింగ్.. నవ్వుతూ ఏదో ఫ్రెండ్లీగా ఇచ్చేశాడు. గేట్లు ఓపెన్ చేసిన ఉన్నాయ్ వెళ్తే వెళ్లు అని ఎంతో సింపుల్‌గా అనేశాడు.

ఆటలు పద్దతి ఆడి గెలవాలని కాజల్‌కు చెప్పిన తీరు కూడా హెచ్చరించినట్టుగా లేదు. జెస్సీ సంచాలక్‌గా తన కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వర్తించలేకపోయాడు. అసలు టాస్కునే సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఇంకోసారి అలా చేయకు అంటూ సింపుల్‌గా వదిలేశాడు. అసలు గడ్డి పెట్టాల్సింది జెస్సికి. ఆ పనీ నాగార్జున చేయలేకపోయాడు. ఇక సన్నీకి క్లాస్ పీకాల్సిందే. ఎందుకంటే ఆ అంటే ఊ అంటే అందరి మీదకు వెళ్లిపోతుంటాడు. ఆవేశం స్టార్ అనే బిరుదు తెచ్చుకోవాలని చూస్తున్నాడే ఏమో.

మానస్, కాజల్, సన్నీ, జెస్సీ, రవి ఇలా ఏ ఒక్కరికి కూడా నాగార్జున గట్టిగా వార్నింగ్ ఇవ్వలేకపోయాడు. అలా మొత్తానికి నిన్నటి ఎపిసోడ్‌లో ప్రోమోలో కనిపించినంత ఫైర్ ఎపిసోడ్‌లో కనిపించలేదు. మొత్తానికి అది పూర్ హోస్టింగ్‌లానే అనిపించింది. ఇక స్క్రిప్ట్ ప్రకారం హోస్టింగ్ చేసినంత కాలం ఇలానే ఉంటుంది. ఎప్పుడైతే ఆటను మనం చూస్తామో, రోజూ ఫాలో అవుతామో అప్పుడే మనకంటూ ఓ అభిప్రాయం వస్తుంది. అప్పుడే మన నిర్ణయాలను చెప్పగలుగుతాం.

Exit mobile version