ఎన్టీఆర్, హృతిక్ కలిసి నటించిన ‘వార్ 2’ సినిమా ఆగస్ట్ 14న రాబోతోంది. ఈక్రమంలో ఆదివారం నాడు హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగవంశీ, ఎన్టీఆర్‌లు ఇచ్చిన స్పీచులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇందులో నాగవంశీ మాట్లాడిన మాటలు చూస్తే తెలుగు దర్శకులు ఎవ్వరూ కూడా ఎన్టీఆర్‌ను బాగా చూపించలేదు అన్న అర్థం వచ్చింది. త్రివిక్రమ్, రాజమౌళి, పూరి జగన్నాథ్ వంటి వారు ఎన్టీఆర్‌ను తెరపై అద్భుతంగా చూపించారు. కానీ నాగవంశీ మాత్రం అయాన్‌ను పైకి లేపడం కోసం తెలుగు దర్శకులందరినీ కిందకు దించేసినట్టుగా కనిపిస్తోంది.
ఇక మరో వైపు ఎన్టీఆర్ తన స్పీచులో డ్యాన్స్ అంటే హృతిక్ రోషన్.. మైఖేల్ జాక్సన్ రేంజ్ అని చెప్పుకొచ్చాడు. కానీ తెలుగులో ఉన్న డ్యాన్సర్ల గురించి మాత్రం చెప్పలేకపోయాడు. ఇక ఎన్టీఆర్ స్పీచుని గమనిస్తే మెగా హీరోలకు కౌంటర్లు వేసినట్టుగా, యాంటీ ఫ్యాన్స్ మీద సెటైర్లు వేసినట్టుగా కనిపించింది. డ్యాన్స్ అంటే తెలుగులో గుర్తుకు వచ్చే హీరోలెంతో మంది ఉన్నారు.. కానీ స్టేజ్ మీద ఎన్టీఆర్ మాత్రం ఆ పేర్లను చెప్పలేదు. ‘వార్ 2’ ప్రమోషన్స్‌లో తారక్, నాగవంశీ మాట్లాడిన మాటలు అయితే ఇప్పుడు మళ్లీ కాంట్రవర్సీకి దారి తీసేలా ఉన్నాయి.