Site icon A2Z ADDA

నేను కొంచెం తేడానే!.. నాగ శౌర్య కామెంట్స్ వైరల్

నాగ శౌర్య ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. వరుసగా నాలుగు చిత్రాలను రిలీజ్ చేసేందుకు రెడీగా ఉన్నాడట. ఇందులో భాగంగా మొదటగా వరుడు కావలెను, లక్ష్య చిత్రాలను సిద్దం చేశాడు. నిన్న రాత్రి విడుదల చేసిన వరుడు కావలెను ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. ప్రేమ, పెళ్లి చుట్టూ తిరిగిన ఈ కథలో భూమి పాత్రలో రీతూ వర్మ, ఆకాష్ కారెక్టర్‌లో నాగ శౌర్య కనిపించారు. పెళ్లి, పెళ్లి చూపులు అనే కాన్సెప్ట్ నచ్చని అమ్మాయిగా భూమి కనిపించింది.

భూమిని అమితంగా ఇష్టపడే పాత్రలో ఆకాష్ నటించాడు. అయితే అంతటి టిపికల్, డిఫికల్టి ఉన్న పాత్ర చుట్టూ ఈ కథ తిరగడంతో అందరికీ ఆసక్తి పెరిగింది. అయితే ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను స్పెషల్‌గా ఏర్పాటు చేశారు. రానాను చీఫ్ గెస్ట్‌గా పిలిచి ట్రైలర్‌ను విడుదల చేయించారు. అనంతరం నాగ శౌర్య తన అభిమానులతో ముచ్చటించాడు. ఈక్రమంలో ఎక్కువ మంది అమ్మాయిలే నాగ శౌర్యను ప్రశ్నలు అడిగారు. అందులోనూ ఎక్కువగా పెళ్లికి సంబంధించిన ప్రశ్నలే సంధించారు.

మీరు నిజ జీవితంలో ఆకాశ్‌లా ఉంటారా? ఆ పాత్రకు మీ నిజ జీవితానికి ఎంత దగ్గరి పోలికలు ఉంటాయి? అని ఓ అమ్మాయి అడిగింది. దానికి నాగ శౌర్య అదిరిపోయే సమాధానాన్ని ఇచ్చాడు. అమ్మాయి తన పక్కన ఉంటే ఆకాశ్‌లా ఉంటాను అని.. ఎంతో కూల్‌గా,కామ్‌గా, సిన్సియర్‌గా ఉంటాను అని అన్నాడు. అదే అమ్మాయి పక్కన లేకపోతే మాత్రం మనం కాస్త తేడానే అని చెప్పేశాడు. మొత్తానికి నాగ శౌర్య మాత్రం తనలోని విభిన్న కోణాల గురించి స్టేజ్ మీదే చెప్పేశాడు.

Exit mobile version