Site icon A2Z ADDA

డోంట్ మ్యారీ బీ హ్యాపీ!.. జోష్‌లో నాగ చైతన్య

టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.నాగచైతన్య సమంతని ప్రేమించి పెళ్లి చేసుకున్న నాలుగు సంవత్సరాల తర్వాత కొన్ని మనస్పర్థల కారణంగా వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఇలా విడాకులు ప్రకటన తర్వాత ప్రస్తుతం వీరిద్దరూ వారి కెరియర్ పై దృష్టి పెట్టి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.ఈ క్రమంలోనే నాగచైతన్య లవ్ స్టోరీ సినిమా ద్వారా అద్భుతమైన విజయాన్ని అందుకొని ఈ సంక్రాంతి కానుకగా బంగార్రాజు చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

బంగార్రాజు చిత్రం జనవరి 14వ తేదీ విడుదల కావడంతో చిత్ర బృందం బుల్లితెరపై ప్రసారమవుతున్న బంగార్రాజుతో సంక్రాంతి సంబరాలు అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా ఈ కార్యక్రమానికి నాగార్జున నాగచైతన్య కృతి శెట్టి హాజరయ్యారు. ఈ క్రమంలో నాగార్జున ఒక టీమ్ నాగచైతన్య ఒక టీమ్ గా ఏర్పడి ఎంతో సరదాగా ఈ కార్యక్రమంలో గడిపినట్లు తెలుస్తోంది.

Kerala lo Sankranthi Allulla Sandadi & Bangarraju tho Sankranthi Sambaralu Promo | Jan 13, 14 @ 9AM

నాగార్జున టీమ్ వైపు కమెడియన్ అలీ ఉండగా నాగచైతన్య టీమ్ వైపు యాంకర్ సుమ కీలకంగా వ్యవహరించారు. ఇక ఈ కార్యక్రమానికి సీనియర్ యాంకర్ ఉదయభాను వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోలో భాగంగా ఈ రెండు టీమ్స్ కి అంత్యాక్షరి నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నాగార్జున సినిమాలోని వద్దురా సోదరా పెళ్లంటే నూరేళ్ల మంటారా.. డోంట్ మ్యారీ బి హ్యాపీ అంటూ నాగ చైతన్య ఎంతో హ్యాపీగా ఈ పాట పాడుతూ ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Exit mobile version