Site icon A2Z ADDA

సమంతతో విడాకులు.. ప్రేమ లేఖలంటూ చైతూ తొలి పోస్ట్

సమంత నాగ చైతన్య విడాకుల తరువాత ఎవరి దారిలో వారు బతికేస్తున్నారు. ఇంతకు ముందున్న ఆనందం కంటే ఎక్కువ ఆనందంగా కనిపిస్తున్నారు. సమంత అయిత రెట్టింపు ఉత్సాహంతో దూసుకుపోతోంది. మరో వైపు నాగ చైతన్య విడాకుల ప్రకటన తరువాత కాస్త మారిపోయాడు. బయటకు రావడానికి ఇష్టపడుతున్నాడు. సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్ అయ్యాడు. కానీ ఇన్ స్టాగ్రాంలో మాత్రం చైతన్య అంత దూకుడుగా వ్యవహరించడు.

ఎప్పుడో అలా ఏదో ఒక పోస్ట్ వేస్తుంటాడు. అలాంటి చైతూ.. గత నెలలో విడాకులు తీసుకున్న తరువాత ఇంత వరకు మరో పోస్ట్ చేయలేదు. ఇన్ స్టాలో చివరగా విడాకుల అంశం మీద స్పందించిన పోస్ట్ మాత్రమే ఉంది. కానీ తాజాగా చైతూ ఓ పోస్ట్ వేశాడు. అందులో ప్రేమ లేఖలు అంటూ గతంలోకి వెళ్లిపోయినట్టు కనిపిస్తోంది. అంటే ఇంకా చైతూ ప్రేమలోనే ఉన్నట్టు కనిపిస్తోంది. హాలీవుడ్ నటుడు రాసిన ఓ బుక్కు మీద చైతూ స్పందించాడు.

హాలీవుడ్ న‌టుడు మాథ్యూ మాక నౌగే రాసిన గ్రీన్‌లైట్స్ అనే పుస్త‌కం గురించి చైతూ స్పందించాడు.. ఇది ఆయ‌న ఆటో బ‌యోగ్ర‌ఫీ. దీన్ని చైతూ చదివినట్టు కనిపిస్తోంది. దీంతో బుక్కులోని సారం బాగానే నచ్చినట్టుంది. జీవితానికి ప్రేమ‌లేఖ‌.. గ్రీన్ లైట్స్ అని కామెంట్స్ పెడుతూ ఆ పుస్త‌కాన్ని పట్టుకుని చదువుతున్నట్టుగా పోజు పెట్టి పోస్ట్ చేశాడు. మీ ఆత్మ‌క‌థ‌ను మాతో పంచుకున్నందుకు ధ‌న్య‌వాదాలు. జీవితంలో ముందుకు వెళ్ల‌డానికి ఈ పుస్త‌కం ఎంత‌గానో ఉప‌యోగప‌డిందని అన్నాడు.

Exit mobile version