Manchu Manoj మంచు మనోజ్.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. వెండితెరపై బ్లాక్ బస్టర్ హిట్‌లు అందించకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం అందరికీ సాయమందిస్తుంటాడు. మంచు మనోజ్ చేసే సేవా కార్యక్రమాలే ఆయనకు ఇంత క్రేజ్‌ను తీసుకొచ్చాయి. సామాజిక సమస్యల మీద స్పందిస్తుంటాడు. ఆడవారి మీద జరిగే అఘాయిత్యాలను ప్రశ్నిస్తుంటాడు.
అలాంటి మంచు మనోజ్ వ్యక్తిగత జీవితం మాత్రం అస్తవ్యస్తంగా మారింది. పెద్దలు కుదిర్చిన వివాహాం ఎక్కువ కాలం నిలవలేదు. మంచు మనోజ్ విడాకుల ప్రకటన కూడా ఎంతో హుందాగా ఉంది. విడిపోతోన్నామని అభిమానులకు తెలియజేశాడు. ఇకపై తాను సినిమాల మీద దృష్టి పెడతాను అని చెప్పుకొచ్చాడు. అలా చెప్పినట్టుగానే కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు.
కానీ కరోనా అంతకంతకూ పెరుగుతుండటం ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు పక్కన పడినట్టు తెలుస్తోంది. అయితే ఈ మధ్య మంచు మనోజ్ పెళ్లి వార్తలు మళ్లీ వైరల్ కాసాగాయి. అసలే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే మంచు మనోజ్ తన మీద వచ్చే రూమర్లు, సెటైర్లకు స్పందిస్తుంటాడు. తన స్టైల్లో కౌంటర్లు వేస్తుంటాడు. ఇలా తన పెళ్లి మీద వచ్చే వార్తలను మంచు మనోజ్ ఖండిస్తుంటాడు.
అయితే ఈ సారి మాత్రం పెళ్లి వార్తలు మరింత గట్టిగా వినిపిస్తున్నాయి. ఈసారి మాత్రం తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడట. మరి ఈ వార్తల్లో ఎంత నిజమున్నదో మంచు ఫ్యామిలీకే తెలియాలి. ఒక వేళ రెండో వివాహాం చేసుకోవడం నిజమైతే.. తన అభిమానులకు ముందే చెప్పేస్తాడు మంచు మనోజ్. ఈ వార్తలపై మంచు మనోజ్ స్పందిస్తాడా? అన్నది చూడాలి.
